మణిరత్నం సినిమాలో మరోసారి ఛాన్స్ కొట్టేసిన సుందరి..

     Written by : smtv Desk | Thu, Feb 01, 2018, 04:08 PM

మణిరత్నం సినిమాలో మరోసారి ఛాన్స్ కొట్టేసిన సుందరి..

హైదరాబాద్, ఫిబ్రవరి 1: ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం ఓ మల్టీ స్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కథానాయికగా అదితీరావును ఎంపిక చేశారు. ఈ సుందరి గతంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'చెలియా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మరో సారి ఈ అమ్మడు ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం కొట్టేసింది. లైకా ప్రొడక్షన్స్-మద్రాస్ టాకీస్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శింబు, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, ఫహద్ ఫాజిల్, ప్రకాశ్ రాజ్, జ్యోతిక, ఐశ్వర్య రాజేశ్, జయసుధ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు.

Untitled Document
Advertisements