సఫారీ సారథి ఔట్..

     Written by : smtv Desk | Sat, Feb 03, 2018, 11:43 AM

సఫారీ సారథి ఔట్..

జొహానెస్‌బర్గ్‌, ఫిబ్రవరి 3 : దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు కు మరో షాక్. ఇప్పటికే గాయంతో ఆ జట్టు స్టార్ ఆటగాడు డివిలియర్స్ దూరమైనా విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు సఫారీ సారథి ఫా డుప్లెసిస్ వన్డే, టీ-20 సిరీస్ కు గాయంతో దూరమయ్యాడు. తొలి వన్డే సందర్భంగా అతడి చేతి వేలికి గాయమై పగులు ఏర్పడిందని పరీక్షల్లో తేలింది. అయితే అతని స్థానంలో నాయకత్వ భాద్యతలు ఎవరు చేపడతారనే విషయాన్ని బోర్డు అధికారులు వెల్లడించలేదు. డుప్లెసిస్ స్థానంలో ఫర్హాన్‌ బెహర్డీన్‌ జట్టులోకి వచ్చాడు.

Untitled Document
Advertisements