అయ్యప్ప దీక్షలో ఉన్న రామ్ చరణ్ అమెరికాలో సూట్ ఎలా వేసుకున్నారు?

     Written by : smtv Desk | Fri, Feb 24, 2023, 12:29 PM

అయ్యప్ప దీక్షలో ఉన్న రామ్ చరణ్ అమెరికాలో సూట్ ఎలా వేసుకున్నారు?

మెగా వారసుడు, పాన్ ఇండియా స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్న విషయం తెలిసిందే. మార్చ్ లో జరగబోయే ఆస్కార్ అవార్డుల కార్యక్రమం కోసం ఆయన ముందుగానే అమెరికాకు వెళ్లారు. అక్కడ అనేక కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. అక్కడి మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
మరోవైపు, అమెరికాకు వెళ్లేటప్పుడు అయ్యప్ప మాలలో ఉన్న చరణ్ నల్లటి దుస్తులు ధరించి, కాళ్లకు చెప్పులు లేకుండా ఎయిర్ పోర్టులో ఆయన వెళ్తున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే, అమెరికాలో మాత్రం ఆయన అయ్యప్ప మాలలో లేకుండా.. సూటు, బూటు ధరించి స్టైలిష్ గా కనిపించడం చాలా మందిని అయోమయానికి గురి చేసింది. అయ్యప్ప మాలలో ఉన్న వ్యక్తి సూటు, బూటు ఎలా వేసుకుంటారని పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు రామ్ చరణ్ టీమ్ సమాధానమిచ్చింది.
హైదరాబాద్ నుంచి న్యూయార్క్ కు వెళ్లేటప్పుడు రామ్ చరణ్ అయ్యప్ప దీక్షలో ఉన్నారని.. అక్కడకు వెళ్లిన తర్వాత 21 రోజుల దీక్ష ముగిసి పోయిందని.. దీంతో, అక్కడే చరణ్ దీక్షను విరమించారని ఆయన టీమ్ వెల్లడించింది. వారిచ్చిన సమాధానంతో ప్రశ్నలకు చెక్ పెట్టినట్టు అయ్యింది.





Untitled Document
Advertisements