మోదీ "ఎగ్జామ్ వారియర్స్"..!

     Written by : smtv Desk | Sat, Feb 03, 2018, 01:51 PM

మోదీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3 : ప్రధాని మోదీ రాసిన "ఎగ్జామ్ వారియర్స్" అనే పుస్తకాన్ని నేడు విడుదల చేయనున్నారు. పెంగ్విన్ ఇండియా ప్రచురించిన ఈ పుస్తక౦.. కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ సమక్షంలో మార్కెట్లోకి రానుంది. ఈ పుస్తకంలో పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడిని ఎలా జయించాలి.? విజయం ఎలా సాధించాలి.? అనే విషయాలను పొందుపరిచారు. "కచ్చితంగా యువతకు పరీక్షల సమయంలో ఒక కొత్త ఉత్సాహాన్ని ఈ పుస్తకం అందిస్తుందని భావిస్తున్నా" అని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. పెంగ్విన్ ఇండియా.. మొత్తం 208 పేజీలు ఉన్న ఈ పుస్తకం టీజర్‌ను తన ట్విట్టర్ ఖాతాలో రిలీజ్ చేసింది.

Untitled Document
Advertisements