లెక్కలేనన్ని బుల్లెట్లతో సమాధానం ఇస్తాం : రాజ్‌నాథ్‌ సింగ్

     Written by : smtv Desk | Sun, Feb 04, 2018, 03:08 PM

లెక్కలేనన్ని బుల్లెట్లతో సమాధానం ఇస్తాం : రాజ్‌నాథ్‌ సింగ్

అగర్తలా, ఫిబ్రవరి 4 : దాయాది దేశం పాకిస్తాన్ దళాల నుండి ఒక్క బులెట్ వచ్చినా.. భారత్‌ తరఫున లెక్కలేనన్ని బుల్లెట్లు స్పందిస్తాయని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. పాక్‌ కాల్పులను తిప్పికొట్టే క్రమంలో భారత్‌ కూడా బుల్లెట్లతో సమాధానం చెప్పాల్సి వస్తుందని శనివారం రాత్రి అగర్తలాలో జరిగిన సమావేశంలో ఆయన వెల్లడించారు. పాకిస్థాన్‌తో భారత్‌ స్నేహపూర్వక సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నా వాళ్లు మాత్రం నిత్యం సరిహద్దులో కాల్పులకు పాల్పడుతున్నారని అన్నారు. ‘‘పాకిస్థాన్‌పై నిత్యం దాడులు జరిపే ఉద్దేశం మాకు లేదు. వారితో ఎప్పుడూ శాంతియుతంగా, సామరస్యంగా జీవనం కొనసాగించాలని కోరుకుంటున్నాం. కానీ, వారు మాత్రం సరిహద్దుల్లో భద్రతా దళాలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారని’’ హోం మంత్రి అన్నారు.

Untitled Document
Advertisements