ముద్దుకృష్ణమనాయుడి సేవలు మరువలేనివి : చంద్రబాబు

     Written by : smtv Desk | Wed, Feb 07, 2018, 11:40 AM

ముద్దుకృష్ణమనాయుడి సేవలు మరువలేనివి : చంద్రబాబు

హైదరాబాద్, ఫిబ్రవరి 7 : టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు(71) హఠాన్మరణంపై పలువురు టీడీపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ.. తన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. డెంగ్యూ జ్వరంతో ఇటీవల కేర్ ఆసుపత్రిలో చేరిన గాలి అర్ధరాత్రి కన్నుమూశారు.
* సీఎం చంద్రబాబు నాయుడు - టీడీపీ ప్రస్థానంలో ముద్దుకృష్ణమది ముఖ్య భూమిక. క్రీయాశీల రాజకీయాల్లో ఎంతో చురుగ్గా ఉంటూ పార్టీకి, ప్రజలకు ఆయన అందించిన సేవలు మరచిపోలేనివి.
* డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప - ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా పలు పదవులు చేపట్టిన గాలి ముద్దుకృష్ణమనాయుడు మృతి పార్టీకి, ప్రజలకు తీరని లోటు. ఆయన చేసిన సేవలు మరువలేనివి. ఎందరో యువ నాయకులకు ముద్దుకృష్ణమనాయుడు ఆదర్శప్రాయుడు.
* మంత్రి పరిటాల సునీత - పార్టీ ప్రస్థానంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మంచి నాయకుడిని కోల్పోవడం బాధగా ఉంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు తీరని లోటు.
* స్పీకర్ కోడెల శివప్రసాద్ - నీతి, నిజాయితీకి మారుపేరు గాలి ముద్దుకృష్ణమనాయుడు. అతనికి ఏ శాఖను అప్పజెప్పినా అంకిత భావంతో పనిచేశారు. గాలి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా.
* ఎమ్మెల్యే బాలకృష్ణ - గాలి హఠాన్మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చి కడవరకు పార్టీలోనే కొనసాగారు.
* పార్లమెంట్ సభ్యుడు నామానాగేశ్వరరావు - ముద్దుకృష్ణమనాయుడు ఎంతో నిస్వార్థపరుడు. ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించే వ్యక్తి.
* టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు - గాలి చనిపోవడం ఎంతో బాధాకర౦. 35ఏళ్లు తన జీవితాన్ని ప్రజల కోసం అంకింతమిచ్చారు. మంచి మిత్రుడిని కోల్పోయా.
* లక్ష్మీపార్వతి - గాలి ఎంతో వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. చివరి వరకు ఎన్టీఆర్‌తో కలిసి ఉన్నారు. గాలి మరణంతో టీటీడీ ఎంతో నష్టపోయి౦ది. ఒక మంచి వ్యక్తిని కోల్పోయామని బాధ కలుగుతోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

Untitled Document
Advertisements