ఇటువంటి సమస్యతో భాదపడేవారు మిల్లెట్స్ కు దూరంగా ఉండాలట

     Written by : smtv Desk | Mon, Mar 11, 2024, 01:06 PM

ఇటువంటి సమస్యతో భాదపడేవారు మిల్లెట్స్ కు దూరంగా ఉండాలట

డయాబెటిస్ తో బాధపడే వారు షుగర్ కంట్రోల్ కోసం ఎక్కువగా రాగులను వాడుతువుంటారు . ఎందుకంటే దీనిలో కాల్షియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి . ఇవి ఆరోగ్యానికి చాలా మంచివని అందరికీ తెలుసు.అంతే కాకుండా ఇందులో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కావున ఎముకలు, కీళ్లను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. బోలు ఎముకల వ్యాధి లేదా ఎముకలు బలహీనపడటం వంటి పరిస్థితులను నివారిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

కానీ అదే పనిగా వాటిని మాత్రమే తింటే కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాగులు కొన్ని దుష్ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇది ఆశ్చర్యం కలిగించే విషయమే అయినా కూడా ఇది నిజమేనంటున్నారు నిపుణులు.

అయితే శరీరంలో ఏదైనా సమస్య వస్తే మాత్రం తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. మీకు ఆరోగ్య సమస్యలు ఉంటే, మిల్లెట్ ఎక్కువగా తినడం వల్ల మీ సమస్యలు మరింత పెరుగుతాయని చెబుతున్నారు. కిడ్నీలో రాళ్లు లేదా కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నట్లయితే మీరు రాగులను తినకూడదు. దీంతో సమస్య మరింత తీవ్రమవుతుందని వైద్యులు చెబుతున్నారు.

థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు కూడా ఈ మిల్లెట్స్ తినకూడదు. ముఖ్యంగా మీరు హైపోథైరాయిడిజంతో బాధపడుతుంటే, ఇవి తినకూడదు. వైద్యుల అభిప్రాయం ప్రకారం, రాగిలో థైరాయిడ్ గ్రంథి సాధారణ పనితీరుకు ఆటంకం కలిగించే గోయిట్రోజెన్‌లతో నిండి ఉంటుంది. అందుకే థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు రాగులు తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

జీర్ణాశయ సమస్యలు ఉన్నవారు కూడాఈ మిల్లెట్స్ తినకూడదు. ముఖ్యంగా ఆకలి లేకపోవడం, వాపు, అజీర్తి వంటి సమస్యలు ఉన్నవారు తినకూడదు. అంతేకాదు.. రాగుల్లో ఉండే కొన్ని పోషకాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల డయేరియా, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. మీకు కడుపులో గ్యాస్ ఏర్పడే సమస్య ఉంటే రాగులను తినకూడదని చెబుతున్నారు.

సాధారణంగా శీతాకాలంలో , వర్షాకాలంలో ఈ మిల్లెట్స్ తినకుండా ఉండటం మంచిది. ముఖ్యంగా చల్లని వస్తువులను తాకకూడదు. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. చల్లదనాన్ని పెంచుతుంది. వర్షాకాలంలో కూడా మిల్లెట్స్‌ వినియోగానికి దూరంగా ఉండటం మంచిది.

పిల్లల నుంచి పెద్దల వరకు మలబద్ధకం సమస్య ఉంటుంది . కాబట్టి మీరు ఇప్పటికే మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నట్లయితే రాగులను తినకండి. మిల్లెట్ తిన్న తర్వాత మీరు ఎక్కువ నీరు త్రాగాలి ఎందుకంటే ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. లేకుంటే మలబద్దకానికి కారణం కావచ్చు.

అనోరెక్సియాతో బాధపడుతున్న వ్యక్తులు మిల్లెట్ వినియోగానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది సాధారణంగా తిన్న తర్వాత కడుపు నింపుతుంది. ఎక్కువసేపు ఆకలిని కలిగించదు.బరువు పెరగాలనుకునే వారు కూడా తినకుండా ఉండాలి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. దీన్ని తినడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు.దీనితో రాగి మాల్ట్ ,అంటే అంబలి , రాగి రోటి ,రాగి ఇడ్లీ వంటివి కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా తయారుచేస్తున్నారు.





Untitled Document
Advertisements