సెల్ ఫోన్ వాడకం ఎక్కువైతే ఆ ఎఫెక్ట్ స్పెర్మ్ కౌంట్ మీద పడుతుందట!

     Written by : smtv Desk | Wed, Mar 13, 2024, 08:39 PM

సెల్ ఫోన్ వాడకం ఎక్కువైతే ఆ ఎఫెక్ట్  స్పెర్మ్ కౌంట్ మీద పడుతుందట!

ప్రస్తుతకాలంలో పక్కనున్న మనిషిని పలకరించే తీరిక ఉండడం లేదు. కానీ మొబైల్ ఫోన్ ద్వారా సంభాషణలు మితిమీరుతున్నాయని, అటువంటి సెల్ ఫోన్ మాటల వల్ల రేడియేషన్‌ ప్రభావం పడుతోందని వైద్యులు అంటున్నారు. అంతేకాకుండా ఎప్పుడు సెల్ ఫోన్ వాడుట కూడా ఒక వ్యసనంగా మారే అవకాశం ఎక్కువ అని అంటారు .ఇప్పుడు సెల్ ఫోన్ వలన నిద్రలేవగానే, ఒకరికొకరు గుడ్ మార్నిగ్ అని చెప్పుకోవడం కంటే నిద్రలేవగానే సెల్ ఫోన్ ను చెక్ చేయడం ఎక్కువైపోయింది. స్మార్ట్ ఫోన్ చూడకుండా తెల్లవారదు.

నిత్యావసర వస్తువుల కంటే, సరసమైన ధరలలో స్మార్ట్ ఫోన్ లభిస్తుంది. అటువంటి స్మార్ట్ ఫోన్ మనిషి జీవనంలో అంతర్భాగం అయిపొయింది.

మన సమాజంలో చదువుకునే బాలబాలికలు ఉంటారు. పెద్దల నుండి పిల్లలకు కొన్ని అలవాట్లు సంక్రమిస్తూ ఉంటాయి..
ఇప్పుడు ఆ కోవలోకి సెల్ ఫోన్ వాడుక కూడా చేరుతుంది. తండ్రిని మించిన తనయుడు అన్నట్టుగా ఫోన్ వాడుక పిల్లలల్లో పెరుగుతుండడం పెరుగుతుందని, దాని వలన బాల్యం నుండే పిల్లలలో అనారోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణుల అంచనా.ఒక అట వస్తువుగా, ఒక పరికరంగా, ఒక టీవీగా, ఓకే సంభాషణ అందించే పరికరంగా, ఇద్దరితో సమన్వయము చేసే పరికరంగా, బిల్ పే చేసే నేస్తంలాగ, వినోదం పంచె మిత్రుడిలాగా సెల్ ఫోన్ మనిషికి మరింత చేరువై, అది ఒక అలవాటుగా మారుతుంది.

సెల్ ఫోన్ వాడడం వలన కలిగే నష్టాలు:
స్మార్ట్ ఫోన్ వాడుక, అదొక అలవాటుగా మారి, వ్యసనంగా వ్యాప్తి చెందే అవకాశం.
శరీర ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది.
మానసిక చికాకులు, మనోవ్యాదులు పెరిగే అవకాశం
సెల్ ఫోన్ జేబులో పెట్టుకుని తిరిగితే, అది స్పెర్మ్ కౌంట్ ను తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

ఫోన్‌లో గంటల తరబడి మాట్లాడుతుంటే, క్యాన్సర్‌ కావాలని కొనుకున్నట్లు ఫోన్లను పదేళ్లుగా వాడే యువతకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ .

అతిగా సెల్ ఫోన్ యూజ్ చేయడం వలన, చేతికి బాధారకమైన స్థితి రావచ్చు, మణికట్టు నుండి మెదడుకు గల నాళం దెబ్బతినే అవకాశం ఉంటుంది

అంతేకాకుండా సెల్ ఫోన్ అలవాటుగా మారి వాహన వాడుకలో కూడా ఫోన్ వాడడం పరిపాటి అయిపోతుంది. దీని వలన వాహన ప్రమాదాలు పెరిగే అవకాశాలు ఎక్కువ.

ప్రతిరోజూ సెల్ ఫోను గంటల తరబడి ఉపయోగిస్తూ, మొబైల్ ఫోన్లను 10 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉపయోగించినట్లయితే బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం రెట్టింపు అవుతుంది .
మరోవైపు సెల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించేవారిలో వినికిడి సమస్య వచ్చే అవకాశం కూడా ఉండవచ్చు
చర్మవ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.సెల్ ఫోన్లో అధికంగా మాట్లాడే వారిలో తలనొప్పి, కళ్ళు తిరగడం, తల తిరగడం, కళ్లు బైర్లుకమ్మడం, ఆకలి మందగించడం, ఆందోళన వంటి అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం కూడా ఎక్కువేనని అంటారు.

పిల్లలపై, తల్లులపై, తండ్రులపై, అత్త, మామలపై ఇలా ఏ బంధం చూసినా ఒంటరిగా మారడానికి సెల్ ఫోన్ ఒక ఆయుధంగా మారుతుంది.కాబట్టి సెల్ ఫోన్ అతి వాడుకను అతి త్వరగా నియంత్రణలోకి తీసుకురావలసిన అవసరం అందరికి ఉంది.తగు సమయంలో దీనిని గురించి ఆలోచన లేకుండా, అదే పనిగా సెల్ ఫోన్ వాడితే, మనిషిలో యాంత్రికత పెరిగి, మానవ సంబంధాలు దెబ్బ తినే అవకాశం ఎక్కువ . దీని వలన నిత్యం ఒత్తిడికి లోనైతే మొదట కోల్పోయేది నిద్రాసమయం. ఇప్పటికే సాఫ్ట్ వేర్ ఎంప్లొయెస్ వల్ల ఈ సమస్య సమాజంలో ఉంటే, అది సెల్ ఫోన్ వలన మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది.





Untitled Document
Advertisements