చర్మాన్ని నిత్య యవ్వనంగా ఉంచే రోజ్ వాటర్ ఇంట్లోనే తయారుచేసుకొండిలా

     Written by : smtv Desk | Thu, Mar 14, 2024, 01:52 PM

చర్మాన్ని నిత్య యవ్వనంగా ఉంచే రోజ్ వాటర్ ఇంట్లోనే తయారుచేసుకొండిలా

అమ్మాయిలు అందరికంటే తామే అందంగా ఉండాలి అని అనుకుంటారు . వారి ముఖం మెరుస్తు, కాంతివంతంగా ఉండాలని అందరూ కోరుకుంటారు.దీని కోసం ప్రజలు వివిధ రకాల చర్మ సంరక్షణ చికిత్సలు తీసుకుంటారు. చర్మ సంరక్షణ చికిత్సలు మీ చర్మంపై తక్షణ ప్రభావాన్ని కలిగిస్తాయి. కానీ కొన్నిసార్లు అవి మీ చర్మాన్ని మెరిసేలా చేయడానికి బదులుగా చర్మాన్ని పాడు చేస్తాయి. అటువంటి పరిస్థితిలో చాలా మంది ఇంటి చిట్కాలు, ఇంట్లో లభించే పదార్థాలపైనే ఎక్కువగా ఆధారపడతారు. ఇంటి చిట్కాల విషయంలో రోజ్ వాటర్ చర్మ సంరక్షణ ఉత్పత్తిలో ముందుగా వాడుతుంటారు. ఇది చర్మానికి గులాబీ రంగును ఇస్తుంది. ఇంట్లో తయారుచేసుకునే రోజ్ వాటర్ చర్మానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది మీ చర్మాన్ని మెయింటైన్ చేయడమే కాకుండా చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఇది అనేక చర్మ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది.
అంతేకాకుండా చర్మాన్ని యవ్వనంగా చేయడంలో రోజ్ వాటర్ బాగా పనిచేస్తుంది. రెగ్యులర్‌గా వాడితే ముఖం పైన ఉన్న మచ్చలు తగ్గి స్కిన్ టోన్ మెరుగ్గా మారుతుంది. చర్మంపై ఉన్న మురికి పోతుంది. స్కిన్ టోనర్‌గా కూడా ఉపయోగపడుతుంది. చర్మాన్ని ఇది హైడ్రేట్ చేస్తుంది. చర్మంలోని Ph బ్యాలెన్స్ నిర్వహించడానికి సహాయపడుతుంది.ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు దూదిని రోజ్ వాటర్‌లో ముంచి ముఖానికి అప్లై చేసుకుంటే చాలా మంచిది.
ఇంట్లోనే రోజ్ వాటర్ తయారీ విధానం : ఇంట్లోనే రోజ్‌ వాటర్‌ తయారీ కోసంమన ఇంట్లో లభించే తాజా గులాబీ పూలు కొన్నింటిని తీసుకోవాలి. పూల నుంచి రేకులను విడదీసి ఒక చిన్న గిన్నెలో తీసుకోవాలి. అందులో నీళ్లు పోసి గులాబీ రేకులను కూడా వేయాలి. తక్కువ మంట మీద ఆ నీటిని వేడి చేయాలి. నీరు బాగా మరిగి ఆవిరి పడుతున్న క్రమంలో స్టవ్ కట్టేయాలి. గిన్నెపై మూత పెట్టి 20 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోవాలి. నీరు గది ఉష్ణోగ్రత వద్దకు వచ్చాక ఒక చిన్న సీసాలో స్టోర్‌ చేసుకుని ఫ్రిజ్లో నిల్వ చేయాలి. దీన్ని వారం రోజుల వరకు వాడుకోవచ్చు. దీనిని సహజంగా సేంద్రియ పద్ధతిలో తయారు చేసాము కాబట్టి, ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. అయితే, దీని కోసం తాజా మంచి స్మెల్ వచ్చే నాటు గులాబీలతో తయారు చేయాలి. ఈ రోజ్ వాటర్ చర్మానికి చాల మంచిది .

ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కావున ఇవి చర్మానికి తాజాదనాన్ని అందిస్తాయి. ఇది చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. ముడతలని కూడా తగ్గిస్తాయి. చర్మాన్ని యవ్వనంగా చేయడంలో రోజ్ వాటర్ బాగా పనిచేస్తుంది. ఈ విధంగా మనము ఎలాంటి పిసా ఖర్చు లేకుండా ఇంట్లోనే రోజ్ వాటర్ చేసుకొని వాడుకోవచ్చు. అంతేకాకుండా దీని వలన ఎలాంటి దుష్పరిమాణాలు రావు . మనము ఇంట్లో చేయడం వలన కెమికల్ ఎఫెక్ట్ ఏమి ఉండదు.





Untitled Document
Advertisements