ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచిన మన రసమలై స్వీట్

     Written by : smtv Desk | Mon, Mar 18, 2024, 07:35 AM

ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచిన మన రసమలై స్వీట్

భారతదేశ వ్యాప్తంగా ఎన్నోరకాల తీపి వంటకాలు ఉన్నాయి. ఒక్కోప్రాంతానికి ఒక్కో రకం స్వీట్ ప్రత్యేకం. ఎవరికీ నచ్చిన స్వీట్స్ వారు ఇంట్లో తయారుచేసుకుని లేదా స్వీట్ షాప్ లో కొనుక్కునే తినడం మనకు తెలిసిందే. అయితే తాజాగా అంతర్జాతీయ ఫుడ్ గైడ్ సంస్థ టేస్ట్ అట్లాస్ ప్రపంచంలోనే అత్యుత్తమ స్వీట్స్ జాబితా విడుదల చేసింది. ఇందులో భారతీయ స్వీట్ రసమలై రెండో స్థానం దక్కించుకుంది. భోజనం సందర్భంగా ఆరగించే స్వీట్లతో ఈ జాబితా రూపొందించింది.
రసమలై ఓ బెంగాలీ వంటకం. బెంగాల్ లో ఏ మూలకు వెళ్లినా రసమలై స్వీట్ నోరూరిస్తూ స్వాగతం పలుకుతుంది. దీని తయారీలో ప్రధానంగా పాలు ఉపయోగిస్తారు. చక్కెర, కుంకుమపువ్వు, నిమ్మరసం రసమలై తయారీలో ఉపయోగిస్తారు.

ఈ లిస్టులో పోలెండ్ స్వీట్ సెర్నిక్ నెంబర్ వన్ గా నిలిచింది. సెర్నిక్ వంటకాన్ని కోడిగుడ్లు, చక్కెరతో తయారు చేస్తారు. సెర్నిక్ కూడా ఒక రకమైన చీజ్ వంటి డిజర్ట్ అని చెప్పాలి.

టేస్ట్ అట్లాస్ రూపొందించిన టాప్-10 డిజర్ట్స్ లిస్టులో సెర్నిక్, రసమలై తర్వాత వరుసగా స్ఫకియానోపిటా (గ్రీస్), న్యూయార్క్ చీజ్ (అమెరికా), జపనీస్ చీజ్ (జపాన్), బాస్క్ చీజ్ (స్పెయిన్), రాకోజీ టురోస్ (హంగేరీ), మెలోపిటా (గ్రీస్), కసెకుచెన్ (జర్మనీ), మిసారెజీ (చెక్ రిపబ్లిక్) స్వీట్లు నిలిచాయి.
ప్రపంచంలోనే రెండవ స్థానం సాధించిన మన రసమలై అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. దాదాపు స్వీట్ లవర్స్ అందరు ఇష్టంగా తినే ఈ తీపి వంటకం ప్రపంచ స్వీట్ జాబితాలో స్థానం సాధించడం హర్షించదగ్గ విషయం.





Untitled Document
Advertisements