పుచ్చకాయ లోపల ఎరుపు రంగులోనే కాదు పసుపు రంగులోనూ ఉంటుందట!

     Written by : smtv Desk | Mon, Mar 18, 2024, 11:46 AM

పుచ్చకాయ లోపల ఎరుపు రంగులోనే కాదు పసుపు రంగులోనూ ఉంటుందట!

మార్చి వచ్చిందంటే చాలు ఎండల వేడికి ఒంట్లో వేడి, తాపం పెరిగిపోతాయి. ఈ ఎండ వేడిమి నుంచి కాపుడుకోడానికి చలచల్లని పానీయాలు, నీటిశాతం అధికంగా ఉండే పండ్లు తీసుకుంటారు . నీటి శాతం అధికంగా ఉండే పండ్లలో పుచ్చకాయ మొదటి స్థానంలో ఉంటుంది. అయితే మీరు ఇప్పటి వరకూ ఎర్రగా ఉండే తియ్యని పుచ్చకాయలను మాత్రమే చూసి ఉంటారు. అవే కాకుండా పసుపు రంగులో కూడా పుచ్చకాయలులభిస్తాయి.
పసుపు పుచ్చకాయలు కూడా సాధారణ పుచ్చకాయల మాదిరిగానే బయట పూర్తిగా ఆకుపచ్చగా ఉంటుంది. అయితే దానిని కట్‌ చేస్తే లోపల పసుపు రంగులో ఉంటుంది. ఇలాంటి పసుపు పుచ్చకాయను "కింగ్ ఆఫ్ ఎడారి" అని పిలుస్తారు. ఇది సాధారణ పుచ్చకాయ కంటే చాలా తియ్యగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తమిళనాడులోని తేని జిల్లాలో గంపం చిన్నమనూరు, కడలూరుతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి పుచ్చకాయలను పండిస్తున్నారు. ఎండాకాలం వచ్చిందంటే పుచ్చకాయలు అమ్మేవారు రోడ్డుపక్కన దుకాణాల్లో ఇలాంటి పసుపు పుచ్చకాయలను అమ్ముతూ కనిపిస్తారు. అన్ని చోట్లా వీటి విక్రయాలు ప్రారంభమయ్యాయి.
ఎర్ర పుచ్చకాయలు దొరకినంతగా పసుపు పుచ్చకాయ మార్కెట్‌లో దొరకవు. దీంతో వీటి ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్, త్రిపుర వంటి రాష్ట్రాల్లో వీటిని ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఎర్ర పుచ్చకాయలను పండించడంలో పేరుగాంచిన త్రిపురలో కూడా పసుపు రంగు పుచ్చకాయల పంట నెమ్మదిగా పుంజుకుంటోంది.
ఈ కొత్త రకం పుచ్చకాయలను సాగు చేయడం వల్ల స్థానిక రైతుల ఆర్థిక స్వావలంబన పొందుతున్నారు. పసుపు పుచ్చకాయలో విటమిన్-బి, విటమిన్-ఎ, సి, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, బీటా-కెరోటిన్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇన్ని రకాలైన విటమిన్స్ ఉన్న పుచ్చకాయలు తినడం వలన మన శరీరానికి ఎలాంటి వేడి తగలకుండా ఉంటుంది . అంతేకాకుండా వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా కాకుండా ఎండా వేడి నుండి ఉపశమనం పొందడానికి చాల ఉపయోగపడుతుంది. మరి ఈ పుచ్చకాయలు గనుక మీకు దొరికితే కచ్చితంగా టేస్ట్ చేయండి.





Untitled Document
Advertisements