రెండేళ్ల త‌ర్వాత ఓ నిర్మాత కొడుకుని హీరోగా పరిచయం చేస్తున్న డైరెక్ట‌ర్ విజయ్ కుమార్ కొండా

     Written by : smtv Desk | Tue, Mar 19, 2024, 05:44 PM

రెండేళ్ల త‌ర్వాత ఓ నిర్మాత కొడుకుని హీరోగా పరిచయం చేస్తున్న  డైరెక్ట‌ర్ విజయ్ కుమార్ కొండా

తొలి చిత్రం ‘గుండెజారి గల్లంతయ్యిందే`‌తో సెన్సేషనల్‌ హిట్ సాధించి రెండో చిత్రం ‘ఒకలైలాకోసం’ వంటి బ్యూటీఫుల్‌ లవ్‌స్టోరితో కమర్షియల్‌ హిట్‌ను సొంతం చేసుకున్న దర్శకుడు విజయ్‌కుమార్ కొండా.స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో విజ‌య్ పేరు కొన్ని వ్య‌క్తిగ‌త విష‌యాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఆ కార‌ణంగా కొన్నాళ్ల పాటు డైరెక్షన్ కు దూరంగా ఉన్నాడు.
హిట్లు లేక‌పోవ‌డం..ఇండ‌స్ట్రీతో గ్యాప్ కూడా ఏర్ప‌డ‌టంతో విజ‌య్ సినిమాలు చేస్తున్నాడా? లేదా? అన్న సందేహాలు సైతం తెర‌పైకి వ‌చ్చాయి. అయితే ప్ర‌స్తుతం విజ‌య్ ఓ నిర్మాత కుమారుడిని హీరోగా ప‌రిచయం చేస్తూ `అహం` అనే సినిమా చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో శివాజీ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. చాలా గ్యాప్ త‌ర్వాత విజ‌య్ పేరు మ‌ళ్లీ ద‌ర్శ‌కుడిగా వినిపించ‌డం ఇదే తొలిసారి. దాదాపు రెండేళ్ల త‌ర్వాత విజ‌య్ చేస్తోన్న చిత్రం.

నిర్మాతగా కార్తికేయ.. పుష్ప స్టార్ తో 2 సినిమాలు అయితే విజ‌య్ ట్యాలెంట్ కి ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడిగా మంచి స్థానంలో ఉండాలి. గుండెజారి విజ‌యం త‌ర్వాత అత‌డికి అగ్ర హీరోల‌తో అవ‌కాశాలు వ‌చ్చిన‌ట్లు అప్ప‌ట్లో ప్ర‌చారం సాగింది. కొంత మంది హీరోల‌కు క‌థ‌లు చెప్పిన‌ట్లు చేప్పి అవి .న‌చ్చ‌డంతో అంగీక‌రించిన‌ట్లు వినిపించింది. అయితే అవి కార్య‌రూపం దాల్చిలేదు. ఇదే స‌మ‌యంలో విజ‌య్ వ్య‌క్తిగ‌త జీవితంలో క‌ల‌త‌లు చోటు చేసుకోవ‌డంతో అత‌డి పేరు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ ఫేజ్ ని దాటుకుని బ‌య‌ట‌కు వ‌చ్చేస‌రికి ఇండ‌స్ట్రీ స‌మీక‌ర‌ణాలు మారిపోయాయి. ఇప్పుడు ఎంత పెద్ద హిట్ ఇచ్చినా హీరో వెయిట్ చేయాల్సిందే. వంద కోట్ల వ‌సూళ్లు హిట్ ఇచ్చినా క్యూలో ఉండాల్సిందే. ఎందుకంటే హీరోలంత బిజీగా ఉంటున్నారు. మ‌రి కొత్త హీరోతో చేస్తోన్న తాజా ప్ర‌య‌త్నంతో దానితో సంబంధించిన ప‌నుల్లోనే బిజీగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.విజ‌య్ ఏ మేర విజ‌యం సాధిస్తాడో చూడాలి.కనీసం రెండు ఎల్లా తరువాత చేసే సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందో చూడాలి మరి .





Untitled Document
Advertisements