భారత్ లో 2026 నాటికి గంటకు 180 కి.మీ వేగంతో పరుగులు పెట్టనున్న బుల్లెట్ రైలు

     Written by : smtv Desk | Tue, Mar 19, 2024, 06:59 PM

భారత్ లో  2026 నాటికి  గంటకు 180 కి.మీ వేగంతో పరుగులు పెట్టనున్న బుల్లెట్ రైలు

వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రజా రవాణ కొరకు బుల్లెట్ రైళ్ల వంటి అత్యాధునిక రైళ్లను ఉపయోగిస్తుంటారు. వీటిలో ప్రధానంగా చైనా, అమెరికా, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు ఉన్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా ఈ బుల్లెట్ రైళ్ల వేగం అందరిని ఆశ్చర్యపరుస్తూ వేగానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాయి. అయితే ఈ బుల్లెట్ రైళ్లను భారత్ లోనూ ప్రవేశపెట్టాలన్నది ఏళ్ల తరబడి వినిపిస్తున్న ప్రతిపాదన.
దీనిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. 2026 నాటికి భారత్ లో తొలి బుల్లెట్ రైలు పరుగులు తీయనుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పలు దేశాల్లో బుల్లెట్ రైలు కోసం 500 కిలోమీటర్ల మేర ప్రత్యేక ట్రాక్ ను నిర్మించడానికి 20 ఏళ్లు పట్టిందని, భారత్ ఈ ట్రాక్ ను 8 నుంచి 10 ఏళ్లలోనే పూర్తి చేయనుందని తెలిపారు.

మొదటి బుల్లెట్ రైలు సూరత్ నుంచి బిలిమోరా మధ్య నడుస్తుందని వివరించారు. భారత్ లో మొదటి బుల్లెట్ రైలు కారిడార్ ను 508.17 కి.మీ మేర నిర్మిస్తున్నామని, దీని ద్వారా అహ్మదాబాద్ నుంచి ముంబయికి కేవలం 2 గంటల 58 నిమిషాల్లో చేరుకోవచ్చని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
బుల్లెట్ రైళ్లు గరిష్ఠంగా గంటకు 320 కి.మీ వేగంతో దూసుకెళతాయి. ప్రస్తుతం భారత్ లో వేగవంతమైన రైలు వందేభారత్. ఇది గరిష్ఠంగా గంటకు 180 కి.మీ వేగంతో పయనిస్తుంది. ఈ రైళ్ళు గనుక అందుబాటులోకి వస్తే దూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రజలకు ప్రయాణం మరింత సులభతరం అవుతుంది.





Untitled Document
Advertisements