బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే పర్సనల్ విషయాలను మాత్రం చెప్పి తప్పు చేయకండి

     Written by : smtv Desk | Wed, Mar 20, 2024, 08:41 AM

బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే పర్సనల్  విషయాలను మాత్రం చెప్పి తప్పు చేయకండి

మనలో చాల మంది మన ఇంట్లో మనుషులను కూడా నమ్మకుండా ఫ్రెండ్స్ ని నమ్ముతారు . ఇది చాలా కామన్.. ప్రతి ఒక్కరికీ చదివేటప్పుడు స్కూల్, ఇంటర్, డిగ్రీ, పీజీ అంటూ ఎక్కడెక్కడో ఎంతో మంది ఫ్రెండ్స్ అవుతుంటారు. మనకున్న ఫ్రెండ్ లీస్ట్ లో ఒకరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఉంటారు. వీళ్లతోనే ఎక్కువ క్లోజ్ గా ఉంటారు. ప్రతీదీ చెప్పకుంటారు. స్నేహం ఎంత ప్రత్యేకమైనా.. కొన్ని విషయాలను మాత్రం చెప్పకూదంటారు పెద్దలు. అవును బెస్ట్ ఫ్రెండ్ కు కూడా చెప్పకూడని విషయాలు ఉంటాయి .
మీరెంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినా మీ ఆదాయము గురించి ఎవరికీ చెప్పకూడదు. మీరు ఏం చేస్తున్నారు ఎలా సంపాదిస్తారు వంటి వాటి గురించి, డబ్బుకు సంబంధించిన విషయాలను మాత్రం ఫ్రెండ్స్ తో చెప్పకూడదు.
మీకున్న ఆస్తి గురించి మీ చుట్టాలకే కాదు మీ క్లోజ్ ఫ్రెండ్ కు కూడా చెప్పకూడదు. చాలా మంది క్లోజ్ ఫ్రెండ్ కదా అని అన్ని విషయాలను చెప్పేస్తుంటాం. కానీ స్నేహం చెడిపోయిన తర్వాత అతను మీ విషయాలను ఎవరికైనా చెప్పే అవకాశం ఉంది. అందుకే మీ ఆస్తుల గురించి ఎవ్వరితోనూ చెప్పకండి. ప్రతి వ్యక్తికి వ్యక్తిగత జీవితం ఉంటుంది. దీనిని వీలైనంత సీక్రేట్ గా ఉంచాలి. ఫోటోలు కూడా ఎన్నో దారుణాలకు ఒడిగడతాయి. అందుకే పర్సనల్ ఫోటోలను మాత్రం ఎవ్వరికీ షేర్ చేయకండి. బెస్ట్ ఫ్రెండ్ అని చాలా మంది పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటుంటారు. ఎందుకంటే వారు ఎవ్వరికీ చెప్పరనే నమ్మకం. కానీ అలా అనుకోవడానికి లేదు. మీరు మీ భాగస్వామి గతం గురించి మీ ఫ్రెండ్ తో అస్సలు మాట్లాడకండి. ఈ విషయం మీ భాగస్వామికి తెలిస్తే మీ సంబంధం దెబ్బతినొచ్చు. అందుకే ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా కొన్ని విషయాల గురించి ఎవరికీ చెప్పకుండా ఉంటేనే మన జీవితంలో ఎలాంటి కష్టనష్టాలకు గురి కాకుండా ఉంటుంది .





Untitled Document
Advertisements