కిచెన్ లో దొరికే వస్తువులతో నల్లగా ఉన్న మెడను తెల్లగా మారుతుందట!

     Written by : smtv Desk | Wed, Mar 20, 2024, 09:49 AM

 కిచెన్ లో దొరికే వస్తువులతో నల్లగా ఉన్న మెడను తెల్లగా మారుతుందట!

ఆడవాళ్లు ముఖాన్ని ఎంత అందంగా ఉంచుకుంటారో మెడను మాత్రం పట్టించుకోరు. కానీ ముఖం అందంగా ఉండి మెడ నల్లగా ఉంటే ఏం ధరించినా మీరు అందంగా కనిపించరు. ముఖ్యంగా మోడ్రన్ దుస్తులు వేసుకోవాలనుకుంటే మెడ భాగం నల్లగా ఉండకూడదు. ముఖం రంగు ఒకలా, మెడ రంగు మరొకలా ఉంటే అస్సలు అందంగా అనిపించదు. మెడ నల్లగా కావడానికి కారణాలు ఏమైనా కావచ్చు
ఆడవాళ్లలో హార్మోన్ల మార్పుల వల్ల, ఊబకాయం, ఇన్సులిన్ రెసిస్టెంట్ వల్ల మెడ భాగం నల్లగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ ఇది ఆడవాళ్ల అందాన్ని పాడుచేస్తుంది. అందుకు మెడ నలుపు రంగును పోగొట్టుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

కొబ్బరి నూనెను మెడపై నలును వదిలించుకోవడానికి ఉపయోగించొచ్చు. ఇందుకోసం కొబ్బరినూనెను గోరువెచ్చగా వేడి చేసి మెడభాగంలో అప్లై చేయండి. తర్వాత వేళ్లతో తేలికగా స్క్రబ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఇలా రోజూ చేస్తుంటే నలుపు రంగు తగ్గడం మొదలవుతుంది.

చింతపండు, పెరుగుతో కూడా మెడ భాగాన్ని మొఖంలా అందంగా మెరిసేలా చేయొచ్చు. ఇందుకోసం చింతపండును వేడినీటిలో నానబెట్టాలి. దీన్ని గుజ్జు తీసి అందులో 1 టేబుల్ స్పూన్ పెరుగు, పసుపు, వేసి బాగా కలపాలి. దీన్ని నల్లగా ఉన్న మెడభాగంలో అప్లై చేసి 30 నిమిషాల తర్వాత కడిగేయాలి. చింతపండులోని ఆల్ఫా యాంటీఆక్సిడెంట్లు, యాంటీ అలర్జీ గుణాలు మెడపై నల్లటి మచ్చలను తొలగించడానికి సహాయపడతాయి.

మెడపై ఉన్న నలుపు పోవాలంటే నారింజ తొక్కలు , పాలు కలిపి గ్రైండ్ చేసి అప్లై చేయండి. నారింజ పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మెడ నల్లబడటానికి కారణమయ్యే టైరోసిన్ సమ్మేళనాలతో పోరాడతాయి.దాని వలన మెడ మీద ఉన్నటువంటి నలుపు తగ్గుతుంది . అలాగే కలబంద గుజ్జులో పంచదార, పాలు కలిపి మెడకు స్క్రబ్ చేయండి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెడను తెల్లగా చేయడానికి సహాయపడతాయి.

అలాగే నిమ్మకాయ, కొబ్బరినూనెతో బేకింగ్ సోడాను స్క్రబ్ చేయడం వల్ల కూడా మెడభాగం నలుపు తొలగిపోతుంది. బేకింగ్ సోడాలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ విధంగా మన కిచెన్ లో లభించే
వస్తువులతో నల్లగా ఉన్న మెడను తెల్లగా నిగనిగలాడుతు చేసుకోవచ్చు .






Untitled Document
Advertisements