ధాన్యం నిలువలకు ఎలుకలబెడద ఉండకూడదంటే ఈ టిప్స్ పాటించండి..

     Written by : smtv Desk | Wed, Mar 20, 2024, 10:07 AM

ధాన్యం నిలువలకు ఎలుకలబెడద ఉండకూడదంటే ఈ టిప్స్ పాటించండి..

గ్రామీణ ప్రాంతాలలో ధాన్యం ఎక్కువగా నిలువ చేయడం వలన ఎలుకలు తిరుగుతుంటాయి . దీని వలన ధాన్యం పాడు అవుతుంది . అంతేకాకుండా కొన్నిసార్లు రేబిస్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు రావచ్చు. అయితే ఎన్ని ఏర్పాట్లు చేసినా, కొన్నిసార్లు ఎలుకలు ఆ
ధాన్యం చుట్టు తిరుగుతాయి. అంతేకాకుండా ఇంట్లో కి కిచెన్ , ఇతర గదుల్లోకి రావచ్చు. వంట గదిలోని సరుకులను నాశనం చేస్తుంటాయి. ఎలుకలు కొరికిన పదార్థాలు తినడం వలన అనారోగ్యానికి దారితీస్తాయి.

అందుకే చాలా మంది గృహిణులు ఎలుకల నివారణకు మార్కెట్‌లో లభించే మందులను తెచ్చి వంటింట్లో పెడతారు. అయితే కెమికల్స్ వాడకుండానే ఈ సమస్యకు కిచెన్ ఐటెమ్స్‌తో చెక్ పెట్టవచ్చు. కొన్ని పదార్థాలు ఘాటైన వాసనను వెదజల్లుతాయి. వాటిని ఇంట్లో పెడితే, ఘాటు వాసనకు ఎలుకలు రావు. అవి ఏంటంటే

ఉల్లిపాయాలు ఘాటైన వాసన వెదజల్లుతాయి. అందుకే వాటిని తరిగేటప్పుడు కళ్లు మంటగా ఉంటాయి. ఈ ఘాటు స్వభావం కారణంగా ఎలుకలు ఇబ్బంది పడతాయి. అందుకే కిరాణా సరుకులు పెట్టే ప్రదేశం, వంటగదిలో ఆహార పదార్థాలను నిల్వ చేసే దగ్గర ఉల్లిపాయ ముక్కలను ఉంచితే చాలా వరకు ఎలుకల బెడద తగ్గుతుంది. ఆనియన్స్ కట్ చేసి, ఇంట్లో వివిధ మూలల్లో పెట్టడం మంచిది దేని వలన ఎలుకల బాధ తాగ్గుతుంది .

బిర్యానీ ఆకుల్లో ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే రుచి కోసం వంటల్లో వీటిని వాడుతుంటారు. తేజ్ పట్టా అని కూడా పిలిచే ఈ ఆకులు ఎలుకలకు సహజమైన నిరోధకంగా పనిచేస్తాయి. ఎదుకంటే ఇవి ఒక రకమైన వాసనను వెదజల్లుతాయి. ఇంట్లో ఎంట్రెన్స్‌ వద్ద, వంటగది తదితర ప్రాంతాల్లో బిర్యానీ ఆకులను ఉంచితే, వాటి వాసనల కారణంగా ఇంట్లోకి ఎలుకలు రావు.

వెల్లుల్లి కూడా ఎలుకల నివారణకు బాగా ఉపయోగపడుతుంది. వీటి నుంచి వచ్చే ఘాటైన వాసన ఎలుకలను వికర్షిస్తుంది. అందుకే వాటిని ఇంట్లో వివిధ మూలల్లో ఉంచడంతో పాటు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ వద్ద పెడితే ఎలుకలు ఇంట్లోకి రాలేవు.


ఒకప్పుడు ఇళ్లలో కిరోసిన్ వినియోగం ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం గ్యాస్ స్టవ్స్, ఛార్జింగ్ లైట్స్ అందుబాటులోకి రావడంతో దీని వాడకం బాగా తగ్గింది. అయితే దీన్ని ఉపయోగించి ఎలుకల బెడద తగ్గించుకోవచ్చు. కిరోసిన్‌ చుక్కలను ఇంట్లో అక్కడక్కడ, ఇంటి చుట్టూ, డస్ట్‌బిన్ వద్ద చల్లాలి. ఈ ఆయిల్ నుంచి వచ్చే ఘాటైన వాసన, ఎలుకలు ఇంట్లోకి రాకుండా నిరోధిస్తుంది.అదేవిధంగా కిచెన్లో దొరికే
తాజా నల్ల మిరియాల వాసన కొంచెం ఘాటుగా ఉంటుంది. వీటిని పొడి కొట్టి ఇంట్లోకి ఎలుకలు వచ్చే చోట చల్లుకోవడం మంచిది. దీని వాసన ఎలుకలకు చెక్ పెడుతుంది.

లెమన్ గ్రాస్ ఆయిల్ మంచి సువాసన వెదజల్లుతుంది. కానీ ఎలుకలకు ఈ వాసన అస్సలు పడదు. సిట్రస్ లాంటి స్మెల్ వ్యాపించే సిట్రోనెల్లా (Citronella) కొవ్వొత్తులను లెమన్ గ్రాస్ ఆయిల్‌తో తయారు చేస్తారు. వీటిని కాలిస్తే, వాసన కారణంగా ఎలుకలు రావు. లేదా ఆయిల్‌ను ఇంట్లో స్ప్రే చేసినా ఫలితం ఉంటుంది.ఈ విధంగా ఎలుకలను మన ఇంట్లో కి రాకుండా ధాన్యాన్ని కాపాడుకోవచ్చును . అలాగే చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఎలుకల విషయంలో చాల జాగ్రత్తగా ఉండాలి





Untitled Document
Advertisements