తల్లి కాబోతున్న అమలా పాల్.. కవలలకు జన్మనివ్వబోతున్నట్టు ఇన్స్టా పోస్ట్

     Written by : smtv Desk | Thu, Mar 21, 2024, 12:35 PM

తల్లి కాబోతున్న అమలా పాల్.. కవలలకు జన్మనివ్వబోతున్నట్టు ఇన్స్టా పోస్ట్

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీ చెందిన హీరో హీరోయిన్లు పెళ్ళి బాట పడుతుంటే ఇప్పటికే పెళ్ళి చేసుకున్న వారు పిల్లలకు జన్మనిస్తున్నారు. ఇప్పటికే హీరో నిఖిల్ సహా పలువురు సెలబ్రీటీలు వారి పిల్లలకు వెల్కమ్ చెప్పగా తాజాగా సినీ హీరోయిన్ అమలాపాల్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను తల్లి కాబోతున్నట్టు వెల్లడించింది. కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నట్టు ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపింది. ఒక చిన్న పాపను ఎత్తుకున్న ఫొటోను షేర్ చేసింది. టూ హ్యాపీ కిడ్స్ అని క్యాప్షన్ పెట్టింది. అమలాపాల్ తొలుత తమిళ దర్శకుడు విజయ్ ని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. వాళ్లు విడిపోవడానికి గల కారణాలు ఎవరికీ తెలియదు. ఆ తర్వాత అమలాపాల్ రెండో పెళ్లి చేసుకుంది. జగత్ దేశాయ్ ని పెళ్లాడింది. సినిమాల విషయానికి వస్తే అమలాపాల్ ప్రస్తుతం మూడు మలయాళ సినిమాలు చేస్తోంది.
అమలా పాల్ షేర్ చేసిన విషయం తెలుసుకున్న అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు.





Untitled Document
Advertisements