మ్యాథ్స్‌ అంటే భయపడే వారి కొరకు బెస్ట్ యాప్ వచ్చేసింది..

     Written by : smtv Desk | Thu, Mar 21, 2024, 02:08 PM

మ్యాథ్స్‌ అంటే భయపడే వారి కొరకు బెస్ట్ యాప్ వచ్చేసింది..

అందరి ఇండ్లలో చదువుకున్న పేరెంట్స్ ఏమి ఉండరు . అలాంటప్పుడు చదువుకునే పిల్లలకు మాథ్స్ లో ఏమైనా డౌట్స్ వస్తే చాల కష్టం అవుతుంది. అంతేకాకుండా కొంతమంది విద్యార్థులకు మ్యాథ్స్‌ అంటే చాల భయం ఉంటుంది. ఎందుకుంటే గణిత సమస్యలను పరిష్కరించడం అంత సులభం కాదు కాబట్టి. గణిత సమస్యలను పరిష్కరించడం చాలా మంది విద్యార్థులకు కష్టమైన పని. దీని కోసం ట్యూషన్ కూడా పెడుతుంటారు. అయినా చాల మంది ఇబ్బంది పడుతుంటారు . దీనివల్ల చాలా మంది విద్యార్థులు మ్యాథ్స్‌ అంటేనే వణికిపోతుంటారు. మ్యాథ్స్‌ సబ్జెక్టుకు దూరంగా ఉంటుంటారు. అదే సమయంలో గణితాన్ని ఇష్టపడే విద్యార్థులు కూడా ఉంటారు . అయితే మ్యాథ్స్‌ అంటే ఇష్టపడే, భయపడే విద్యార్థుంలదరికీ సహాయం చేయడానికి గూగుల్ నుండి ఒక యాప్ అందుబాటులో ఉంది. ఈ యాప్‌ ఏంటో తెలుస్తే ఆశ్చర్యపోతారు .

కొత్తగా లాంచ్ చేసిన ఫోటోమ్యాథ్ యాప్‌తో ఇది సాధ్యమే. ఇకపై మీరు మ్యాథ్స్ ప్రాబ్లెమ్ పరిష్కరించాలి అంటే ఈ యాప్ లో ఒక్క ఫోటో తీస్తే చాలు మీకు సమాధానం వస్తుంది. ఈ యాప్ ఒక స్మార్ట్ కెమెరా కాలిక్యులేటర్ మరియు మ్యాథ్స్ అసిస్టెంట్ యాప్. ఇందులో, ఫోటో తీయడం ద్వారా మ్యాథ్స్ ఈక్వేషన్ లు పరిష్కరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. కనుక ఇది మీ కష్టమైన త్రికోణమితి లేదా బీజగణిత వంటి వాటిని కూడా పరిష్కరించవచ్చును. ఈ యాప్ దశల వారీ పరిష్కారాలతో దాన్ని అర్థం చేసుకోవడంలో అక్షరాలా మీకు సహాయం చేస్తుంది. టీచర్స్ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే తీర్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మీరు ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిగా మారడానికి పని చేస్తుంది.

ఈ Photomath యాప్‌ Google Play Storeలో అందుబాటులో ఉంది. ఇది గణిత విద్యార్థులకు సహాయపడే గూగుల్‌ ప్రత్యేక యాప్‌. గూగుల్ ఈ యాప్‌ను 2023లో కొనుగోలు చేసింది. ఈ యాప్‌ను స్మార్ట్ కెమెరా కాలిక్యులేటర్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది కెమెరా కాలిక్యులేటర్ లాగా పనిచేస్తుంది. ఇది ఏదైనా గణిత సమస్య చిత్రాన్ని చూసి దానిని లెక్కించడం ప్రారంభించి దాని పరిష్కారాన్ని కనుగొంటుంది. విద్యార్థులు ఏదైనా గణిత ప్రశ్నకు సంబంధించిన ఫోటోను ఈ గూగుల్‌ యాప్‌లో అప్‌లోడ్ చేస్తే యాప్ ఆ ప్రశ్నకు దశల వారీగా పరిష్కారాన్ని అందిస్తుంది . ఈ యాప్ వలన మాథ్స్ అంటే భయం ఉండే పేరెంట్స్ కి కానీ పిల్లలకు కానీ మంచి ఉపయోగం ఉంటుంది.ఏది ఏమైనా దేనినైనా మనకు కావలసినంత వరకే ఉపయోగించుకోవాలి .







Untitled Document
Advertisements