లేట్ వయసులోనూ ట్రెండీ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్ళను అల్లాడిస్తున్న శ్రియ శరన్

     Written by : smtv Desk | Thu, Mar 21, 2024, 04:15 PM

లేట్ వయసులోనూ  ట్రెండీ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్ళను అల్లాడిస్తున్న శ్రియ శరన్

శ్రియ శరన్ స్టార్ హీరోల సరసన నటిస్తూ విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఇక ఇప్పుడు కొత్త భామల తాకిడి ఎక్కువ కావడంతో ఈ హాట్ బ్యూటీకి ఆఫర్స్ కరువయ్యాయి. అడపాదడపా చిన్న చిన్న రోల్స్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది . అయినా సినిమాలతో సంబంధం లేకుండా నెటిజనుల్లో అభిమానుల్లోనూ నిరంతరం హాట్ టాపిక్ గా మారడం బ్యూటీ ప్రత్యేకత. ట్రెండీ ఫోటోలను షేర్ చేస్తూ క్రేజీ భామగా యువత గుండెల్లో నిలుస్తుంది. అగ్ర హీరోయిన్ గా రాణిస్తోన్న సమయంలో ఎలాంటి హవా సాగించిందో ఇప్పటికీ బోయ్స్ లో అదే ఫాలోయింగ్ ని మెయింటెన్ చేస్తుంది. ఏ ఇతర నాయికకు సాధ్యం కానిది శ్రీయకు మాత్రమే ఇది సాధ్యమైనది. కానీ కెరీర్ ప‌రంగా అమ్మ‌డు దూకుడు మాత్రం బాగా త‌గ్గిన‌ట్లే క‌నిపిస్తోంది. మునుప‌టిలా వేగం ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోతుంది. 2022 లో మూడు సినిమాలతో అల‌రించినఈ అమ్మ‌డు గ‌తే ఏడాది కేవ‌లం 'క‌బ్జా'..'మ్యూజిక్ స్కూల్' లాంటి చిత్రాల్లోనే న‌టించింది. ఆ రెండు కూడా ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌లేదు. భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన 'క‌బ్జా' రొటీన్ స్టోరీగా తేలిపోవ‌డంతో శ్రియ ఎఫెర్ట్ అంతా వృద్ధా ప్ర‌య‌త్నంగా మిగిలిపోయింది.అయినా అప్ప‌టికే చేతిలో ఉన్న పెద్ద అవ‌కాశం అదొక్క‌టే. కానీ తాను ఒక‌టి అనుకుంటే ఫ‌లితం మ‌రోలా వ‌చ్చింది. మ‌రో చిన్న సినిమా కావ‌డంతో ఆ ప్రాజెక్ట్ పై పెద్ద‌గా ఆశ‌లేం పెట్టుకోలేదు. కానీ తెలుగు సినిమా కావ‌డంతో కంబ్యాక్ కి పనికొస్తుంద‌ని భావించిది గానీ ప‌న‌వ్వ‌లేదు. అప్ప‌టికే ఈ అమ్మ‌డు తెలుగు సినిమా చేసి మూడు-నాలుగేళ్లు అవుతుంది. బోయ్స్ లో క్రేజ్ అయితే ఉంది గానీ ఇంకా న‌టిగా అల‌రిస్తుందా? లేదా?అన్న విమ‌ర్శ ఇక్క‌డ లేక‌పోలేదు.

ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డికైతే చేతిలో అవ‌కాశాలు లేవు. హిందీలో మాత్రం 'షో టైమ్' అనే ఓటీవీ సిరీస్ చేస్తుంది. ఇది త‌ప్ప ఛాన్సులేవి లేవు. తాజాగాఈ అమ్మ‌డు ఇన్ స్టాలో ఓ హాట్ ఫోటో షేర్ చేసింది. అందులోఈ అమ్మ‌డు చిట్టిపొట్టి దుస్తుల్లో త‌ళుక్కున మెరిసింది. గోల్డ్ క‌ల‌ర్ డిజైన్ ల్లో శ్రియ కుర్రాల గుండెలలో సెగ‌లు రేపిన‌ట్లే క‌నిపిస్తుంది. ఆ అందాల్ని మిర‌ర్ లో రిప్లెక్ట్ చేసి మ‌రీ షో చేసి మురిసిపోతుంది . కనీసం ఈ ఏడాది అయినా ఈ అమ్మడుకి చేతి నిండా సినిమాలు వస్తాయో చూడాలి మరి.






Untitled Document
Advertisements