మరో కొత్త మూవీతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

     Written by : smtv Desk | Fri, Mar 22, 2024, 04:42 PM

మరో కొత్త మూవీతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

రెబల్ స్టార్ ప్రభాస్ బహుబాలి సినిమాతో తన ఇమేజ్ ని అంతకుఅంత పెంచుకున్నాడు . అంతేకాక వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నాడు. చాల రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు ప్రభాస్ కల్కి సినిమాతో వస్తున్నాడు . ఈ సినిమాను మే 9న రిలీజ్ చేసేందుకు మేకర్స్ కృషి చేస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి 2898 AD సినిమా మొదటి పార్ట్ మేలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనిదత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనె, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తుండగా కమల్ హాసన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.
ఈ సినిమాతో పాటుగా మారుతి దర్శకత్వంలో ప్రభాస్ మరొక సినిమా రాజా సాబ్ చేస్తున్నాడు. ఆ సినిమా విషయంలో కూడా రెబల్ ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఉన్నారు. ముఖ్యంగా ఫస్ట్ లుక్ గా వచ్చిన ప్రభాస్ వింటేజ్ లుక్ రాజా సాబ్ మీద భారీ హైప్ వచ్చేలా చేసింది. మారుతి సైలెంట్ గా సినిమాను పూర్తి చేస్తున్నా ఈ సినిమా నుంచి ఒక్క పోస్టర్ తప్ప మిగతా అప్డేట్ రాలేదని ఫ్యాన్స్ అంతా డిజప్పాయింట్ గా ఉన్నారు. రాజా సాబ్ టీజర్ కోసం రెబల్ ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. టీజర్ అప్పుడు ఇప్పుడు అని ఊరిస్తున్నారు తప్ప రాజా సాబ్ టీజర్ ని వదల్లేదు. అయితే కల్కి రిలీజ్ ఉన్న ఈ టైం లో రాజా సాబ్ అప్డేట్ ఇస్తే ఆడియన్స్ లో కన్ ఫ్యూజన్ ఏర్పడుతుందని మేకర్స్ వెనకడుగు వేసినట్టు తెలుస్తుంది. రాజా సాబ్ సినిమా థ్రిల్లర్ జోనర్ లో కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతుంది.
ఈ సినిమా కుదిరితే ఈ ఇయర్ డిసెంబర్ లేదా 2025 సంక్రాంతికి రిలీజ్ టార్గెట్ పెటుకున్నారని తెలుస్తుంది. ప్రభాస్ సినిమా పండుగకి వస్తే ఆ హంగామా ఒక రేంజ్ లో ఉంటుంది. రాజా సాబ్ రెబల్ ఫ్యాన్స్ ని ఏ మేరకు మెప్పిస్తుంది అన్నది వచ్చే సంక్రాంతికి తెలుస్తుంది. సంక్రాంతికి వచ్చే స్టార్ సినిమాలతో పాటు ప్రభాస్ రాజా సాబ్ కూడా రేసులో దిగుతుంది .ఈ సినిమా రెబల్ స్టార్ కు మరో బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది అని ప్రేక్షకుల బలంగా ఫిక్స్ అయ్యారు.






Untitled Document
Advertisements