మీ మ్యారేజ్ డేకి భార్యకి ఈ గిఫ్ట్స్ ఇస్తే ఫిదా..

     Written by : smtv Desk | Sat, Apr 06, 2024, 03:58 PM

మీ మ్యారేజ్ డేకి  భార్యకి ఈ గిఫ్ట్స్ ఇస్తే ఫిదా..

వివాహం అనేది ఇద్దరి మనుషులను , వారి మనస్సును ఏకం చేసే ఒక ఆయుధం అనుకోవచ్చును . ఈ నేపథ్యంలో వివాహం సందర్భంగా భర్తే స్వయంగా భార్యకి కానుకలిస్తే ఆ ఆనందం రెట్టింపు అవుతుంది కదా. గిఫ్ట్స్ అనేవి ఎప్పుడు కూడా ప్రత్యకమే. ఒకరు మనకోసం ఆలోచించి గిఫ్ట్స్ తీసుకొస్తే వాటిని అందుకున్నప్పుడు వచ్చే ఆనందమే వేరు. మరి అందుకోసం ఏయే గిప్ట్స్ ఇవ్వొచ్చో తెలుసుకోండి.

ఆభరణాలు:
ఆడవారికి ఆభరణాలంటే ఎప్పుడు కూడా ఇష్టమే. అయితే, మ్యారేజ్ టైమ్‌లో మీ భార్యకి ఈ నగల్ని గిఫ్ట్‌గా ఇస్తే అది జీవితాంతం గుర్తుగా ఉంటాయి. వీటిని మరింత అందంగా మీ పేర్లని డిజైన్ చేయించుకుని ఇవ్వొచ్చు.ఇలా చేయడం ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది మీకు ఆమె పైన ఉన్న ప్రేమని తెలియచేస్తుంది .

కుకింగ్:
ప్రతిరోజూ మీకోసం రుచిగా వండిపెట్టే మీ భార్యకి ఒక్కరోజైనా విశ్రాంతి ఇవ్వండి.మీ మ్యారేజ్ డే సందర్భంగా మీరే చెఫ్‌గా మారి తనకి రుచికరంగా వంట చేసి పెట్టండి. దీని వల్ల మీ రిలేషన్‌షిప్ స్ట్రాంగ్ అవుతుంది.అంతేకాకుండా మీ ప్రేమకి చిహ్నంగా ఏదైనా పేయంటింగ్‌ని స్వయంగా మీరే వేసి మీ భార్యకి గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. దీంతో మీ అర్థాంగి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదే విధంగా, తనకి మంచి రెస్టారెంట్‌లో క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా ప్లాన్ చేయొచ్చు. దీంతో మంచి టేస్టీయెస్ట్ ఫుడ్‌ని ఎంజాయ్ చేయొచ్చు.


వీకెండ్ టూర్:
టూర్ అనేది కూడాఎప్పుడు కూడా భార్యభర్తల మధ్య స్వీట్ మెమొరీస్‌ని కలెక్ట్ చేసేలా ఉంటుంది. మీరు మీ పార్టనర్‌తో కలిసి మంచి వీకెండ్ టూర్ ప్లాన్ చేయండి. దీని వల్ల మీ లవ్ జర్నీ హ్యాపీగా ఉంటుంది. దీనికోసం మీరు కొన్ని రోజులు సెలవు తీసుకుని మరీ హ్యాపీగా ఎంజాయ్ చేయండి.ఈ ఉరుకులు పరుగుల జీవితంలో కాస్త రిలాక్సగా కూడా ఉంటుంది .

ఇది కాస్తా డిఫరెంట్‌గా ఉన్నప్పటికీ చాలా రిలాక్సింగ్ గిఫ్ట్స్ అని చెప్పొచ్చు. మంచి స్పాలో వారికి అపాయింట్ తీసుకుని గిఫ్ట్ ఇవ్వొచ్చు. దీంతో వారు చాలా రిలాక్స్‌డ్‌గా ఫీల్ అవుతారు. ఇది కష్టమనుకుంటే వారికి స్పా కిట్ కూడా ఇవ్వొచ్చు. దీని వల్ల వారికి కావాలనుకున్నప్పుడు స్పా చేయించుకోవచ్చు.
మీరు మీ భార్యని ఆనందపరిచేందుకు తన ఇష్టఇష్టాలను తెలుసుకుని వాటికి సంబంధించిన సబ్‌స్క్రిప్షన్ కూడా ఇవ్వొచ్చు. ఇందులో ఆన్‌లైన్ సబ్‌స్క్రిప్షన్స్ దగ్గర్నుంచి మ్యాగ్జైన్స్, బ్యూటీ ప్రోడక్ట్స్ వరకూ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవచ్చు. వీటితతో పాటు మీకంటూ ఉండే కొన్ని బ్యూటీపుల్ ఫొటోలను ఆల్బమ్‌లా డిజైన్ చేసి తనకి గిఫ్ట్‌గా ఇవ్వండి. ఇందులో మీరు లెటర్స్ రాయొచ్చు. మంచి మంచి క్యాప్షన్స్ చేసి తనకి గిఫ్ట్‌గా ఇవ్వండి ఈ విధంగా చిన్న చిన్న గిఫ్ట్స్ అయినా భార్య భర్తల మధ్య బంధాన్ని గట్టి పడడానికి ఉపయోగపడతాయి .





Untitled Document
Advertisements