సముద్రాలలో నీరు ఉప్పగా ఉండడానికి కారణం ఏంటి?

     Written by : smtv Desk | Thu, Apr 11, 2024, 11:24 AM

సముద్రాలలో నీరు ఉప్పగా ఉండడానికి కారణం ఏంటి?

మనషి జీవించాలి అంటే పంచభుతాలైన నీరు, నిప్పు, గాలి, నింగి, నెల అన్ని ముఖ్యం. నీరు జీవనాధారం అయితే సముద్రాలలో నీరు ఎంత ఎక్కువగా ఉన్నా, సముద్రం ఎంతపెద్దది అయిన ఎంత నీరున్నా తాగడానికి గుక్కెడు నీళ్ళు కూడా పనికిరావు అంటారు. అయితే ఈ సముద్రంలోకి వచ్చే నీరంతా కూడా కాలువలు, సెలయేళ్ళు, నదుల నుండే వస్తుంది. మరి కాలువలు, సెలయేళ్ళు, నదులలోని నీరు తాగడానికి అనువుగా ఉంటాయి. ఈ నీరే సముద్రంలో కలిసిన తరువాత తాగడానికి వీలుండదు కారణం.. కాలువలు, సెలయేళ్ళు, నదులలోని నీరంతా కూడా సముద్రంలో కలిసే క్రమంలో నదీ జలాలలోని కొండరాళ్ళు, డెబ్రిస్ (గుర్రపుడెక్క, తుక్కు తదితర వ్యర్థ పదార్థాలు) కలిసి వుంటాయి. ఈ కొండరాళ్ళలో ఖనిజ లవణాలు ముఖ్యంగా సోడియం క్లోరైడ్ అనే లవణం ఎక్కువగా ఉంటుంది. నదీజలాలు సముద్రంలో కలిసినప్పుడు వాటిలోని ఖనిజ లవణాల ప్రభావం వల్ల సముద్రంలోని నీరు ఉప్పగా మారుతుంది. అయితే సముద్ర జలాలు సూర్యరశ్మి ప్రభావంతో ఆవిరై అవి మేఘాలుగా మారినప్పుడు వాటికి అంతకుముందు ఉన్న ఉప్పదనం వర్షం కురిసినప్పుడు మాములుగానే ఉంటాయి.





Untitled Document
Advertisements