బరువు తగ్గాలి అనుకునేవారికి ఈ జ్యూస్ బెస్ట్ ఆప్షనట..

     Written by : smtv Desk | Sat, Jun 22, 2024, 11:50 AM

బరువు తగ్గాలి అనుకునేవారికి ఈ జ్యూస్ బెస్ట్ ఆప్షనట..

చింతపండు రుచికి పుల్లగా ఉన్న ఆరోగ్యానికి మంచిది. చింతపండుతో పులిహోరా, రసం, చారు, పులుసుకూరలు, పచ్చడి వంటివి తయారుచేస్తారు. చింతపండుతో ఏ వంటకం తయారుచేసిన చాలా రుచిగా ఉంటుంది. బోలెడు ఆరోగ్యప్రయోజనాలు ఉన్న ఈ చింతపండు రసం తాగడం వలన బరువు తగ్గుతారట.. ఈ నీటిని తాగితే చాలా మంచిది. మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలని అందిస్తాయి. అవన్నీ ఏంటో తెలుసుకోండి.

* హైడ్రేషన్.. ఎక్కువ శాతం నీటితో తయారైన మన బాడీకి హైడ్రేషన్ చాలా ముఖ్యం. సమ్మర్‌లో బాడీ డీహైడ్రేట్ అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే చింతపండు నీరు తాగాలి. దీని వల్ల డీహైడ్రేషన్‌ని తగ్గించుకోవచ్చు.

* విటమిన్స్.. చింతపండులో విటమిన్ సి, ఎ, థయామిన్, రైబోఫ్లేవిన్ ఉంటాయి. ఇవన్నీ మీ ఆరోగ్యానికి చాలా మంచివి. దీనిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. అంతేకాకుండా ఈ నీటిని తీసుకోవడం వల్ల విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. కాబట్టి, రెగ్యులర్‌గా తాగండి.

* బీపి.. చింతపండు నీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఈ నీటిని రెగ్యులర్‌గా తాగితే రక్తపోటు కంట్రోల్ అవుతుంది. దీంతో పాటు చాలా సమస్యల్ని దూరమవుతాయి. అంతేకాకుండా, ఇందులోని ఇన్‌ఫ్లమేటరీ గుణాలు గౌట్ వంటి సమస్యలు దూరమై మంట, నొప్పులు తగ్గుతాయి.

* జీర్ణక్రియ.. సమ్మర్‌లో చాలా మందికి జీర్ణ సమస్యలు వస్తాయి. ఈ నీటిని తాగడం వల్ల జీర్ణ ఎంజైమ్స్ ఉత్తేజితమవుతాయి. దీంతో మలబద్ధకం, కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు దూరమై జీర్ణక్రియ మెరుగవుతుంది. దీంతో పాటు ఈ నీరు తాగితే బాడీ చల్లగా ఉంటుంది. దీంతో వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు. దీంతో పాటు అలసట, తలనొప్పి, తలతిరగటం వంటివి దూరమవుతాయి.

* శరీర బరువు.. చింతపండు నీరు తాగడం వల్ల కూడా బరువు తగ్గుతారు. ఎందుకంటే, ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎక్కువగా తినలేరు. జీవక్రియ పెరుగుతుంది. అయితే, లాభాలున్నాయి కదా అని ఎక్కువగా తాగొద్దు.





Untitled Document
Advertisements