బరువుతగ్గేందుకు ఓట్స్ ఎలా తినాలంటే ?

     Written by : smtv Desk | Sat, Jun 22, 2024, 12:11 PM

బరువుతగ్గేందుకు ఓట్స్ ఎలా తినాలంటే ?

ప్రస్తుతకాలంలో రకరకాల కారణాల వలన బరువు పెరుగుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. కారణాలు ఎవైనా అధికబరువు అనర్థదాయకం అనే విషయం అందరికి తెలుసు. అధికబరువు వలన కాళ్ళనొప్పులు మొదలుకుని అనేక రకాలైన ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయి. కాబట్టి బరువుని అదుపులో ఉంచుకోవడం అనేది తప్పనిసరి. ప్రజెంట్ అందుబాటులో ఉన్న ఫుడ్స్‌లో ఓట్స్ ఒకటి. వీటిని ఎవరైనా తినొచ్చు. బరువు తగ్గడానికి ఓట్స్ కూడా హెల్ప్ చేస్తాయి. ఇందుకు కారణం.. ఇందులో కొలెస్ట్రాల్‌ని తగ్గించే గుణాలున్నాయి. కాబట్టి, బరువు తగ్గడానికి ఓట్స్ తీసుకోవడం మంచిది.

* బరువు తగ్గేందుకు.. ఓట్స‌లో ఒమేగా 6 ఆయిల్, లినోలెయిక్ యాసిడ్స్ ఉన్నాయి. వీటిని సాధారణంగా మంచి కొవ్వులు అంటారు. ఇందులో మాంగనీస్, ఫాస్పరస్, మెగ్నీషియం, కాపర్, ఐరన్, జింక్, ఫోలేట్, విటమిన్ బి1, బి5, కాల్షియం, పొటాషియం, విటమిన్ బి 6, విటమిన్ బి3 వంటి ఎన్నో మూలకాలు ఉన్నాయి. ఓట్స్‌లో ఫైబర్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉన్నాయి. దీని వల్ల బరువు ఈజీగా తగ్గుతారు.

* ఏ ఓట్స్.. మనం తీసుకునే ఓట్స్ కూడా ఏవి తీసుకుంటున్నామో చూసుకోవాలి. ముఖ్యంగా ప్రాసెస్డ్ ఓట్స్ మంచివి కాదు. బరువు తగ్గేందుకు స్టీల్ కట్ ఓట్స్, రోల్డ్ ఓట్స్ మంచివి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అదే విధంగా, సాధారణ ఓట్స్ కంటే ఇన్‌స్టంట్ ఓట్స్‌లో 70 శాతం ఎక్కువ కేలరీలు ఉంటాయి.

* ఎలా ప్రిపేర్ చేయాలి.. ఓట్స్ తయారు చేసే విధానం కూడా ముఖ్యమైనది. ఓట్స్‌ని పాలు కలపకుండా తీసుకోవడం మంచిది. మరీ తీసుకోవాలనుకుంటే లో ఫ్యాట్ మిల్క్‌తో కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారు.

* తీపికోసం.. ఓట్స్ ఎలాంటి రుచి ఉండవు. దీని కారణంగా మార్కెట్‌లో రుచికరంగా చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఇవన్నీ నిజమైన మంచి గుణాలను నాశనం చేస్తాయి. ఓట్స్‌లో పంచదార కూడా వేయొద్దు. తీపి కావాలనుకుంటే ఓట్స్ పండ్లు, నట్స్ వేయడం వల్ల రుచితో పాటు హెల్దీగా మారతాయి.





Untitled Document
Advertisements