ఉల్లిపాయ హెయిర్ ప్యాక్ తో తెల్లజుట్టు సమస్యకు చెక్!

     Written by : smtv Desk | Tue, Jun 25, 2024, 05:05 PM

ఉల్లిపాయ హెయిర్ ప్యాక్ తో తెల్లజుట్టు సమస్యకు చెక్!

మృదువుగా, పట్టులా పట్టుకుంటే జారిపోయే నల్లటి ఒతైన కురులు కావాలి అనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ రకరకాల కారణాల వలన జుట్టు రాలే సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అయితే, జుట్టు రాలడాన్ని తగ్గించి చక్కగా పెరిగేలా చేసేందుకు కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. అందులో ఓ చక్కని హెయిర్ ప్యాక్ కూడా ఉంది. అదేంటో తెలుసుకోండి.

అల్లం.. జీర్ణ సమస్యల్ని దూరం చేయడంలో అల్లం ముందుంటుంది. దీనిలో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి జుట్టుకి పోషణని అందిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ వెంట్రుకల కుదుళ్ళని బలంగా చేస్తాయి. దీంతో జుట్టు పెరుగుతుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు స్కాల్ప్ సమస్యల్ని దూరం చేస్తాయి.

కరివేపాకు.. కరివేపాకు కూడా కూరల్లో ఎక్కువగా వాడతాం. దీనిని తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుతుంది. కరివేపాకు జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాదు, వైట్ హెయిర్ వంటి సమస్యల్ని రివర్స్ చేస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి స్కాల్ప్‌ని హైడ్రేట్ చేస్తాయి. అంతేకాకుండా కుదుల్ళని బలంగా చేస్తాయి. ఇందులోని బీటా కెరోటిన్, ప్రోటీన్ జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు పెరుగుదలకి హెల్ప్ చేస్తుంది.

ఉల్లిపాయలు.. ఉల్లిపాయలు ప్రతి ఇంట్లోనూ దొరుకుతాయి. ఇందులో సల్ఫర్ ఉంటుంది. దీంతో జుట్టు పెరుగుదలకి హెల్ప్ చేస్తుంది. జుట్టుకి కావాల్సిన పోషకాలన్నీ ఉల్లిపాయలో ఉంటాయి. ఉల్లిపాయల నుండి సల్ఫర్ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. కొల్లాజెన్ హెల్దీ చర్మ కణాల ఉత్పత్తికి, జుట్టు పెరుగుదలకి హెల్ప్ చేస్తుంది.

ఏం చేయాలంటే.. ఓ మిక్సీ జార్‌లో ఓ ఉల్లిపాయ, ఓ అంగుళం అల్లం ముక్క, గుప్పెడు కరివేపాకు వేసి మిక్సీ పట్టాలి. ఈ పేస్టుని హెయిర్‌ప్యాక్‌లా వేసుకోవాలని ఆరిన తర్వాత జుట్టుని క్లీన్ చేసుకోండి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.





Untitled Document
Advertisements