ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ ఎంపీలతో బాబు భేటీ

     Written by : smtv Desk | Thu, Jun 06, 2024, 01:18 PM

ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ ఎంపీలతో బాబు భేటీ

ఆంధ్రపదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఎంపీలను ఉండవల్లిలోని తన నివాసానికి ఆహ్వానించారు. పార్టీ ఎంపీలతో గురువారం మధ్యాహ్నం భేటీకి ఏర్పాట్లు చేశారు. బుధవారం ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ భేటీ తర్వాత ఏపీకి తిరిగి వచ్చిన చంద్రబాబు.. పార్టీ ఎంపీలతో గురువారం భేటీ ఏర్పాటు చేశారు. దీనిపై అందరికీ సమాచారం పంపించారు. శుక్రవారం ఢిల్లీలో మరోమారు జరగనున్న ఎన్డీఏ కూటమి భేటీలో చంద్రబాబు టీడీపీ ఎంపీలతో కలిసి పాల్గొంటారు.
ఈ నేపథ్యంలోనే పార్టీ ఎంపీలతో గురువారం తన నివాసంలో భేటీ ఏర్పాటు చేశారు. ఎన్డీఏ కూటమి నేతగా ఎన్నికైన నరేంద్ర మోదీ ఈ నెల 8న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ ఇప్పటికే టీడీపీ ఎంపీలకు ఆహ్వానం అందింది. ఈ విషయాలపై చర్చించేందుకే చంద్రబాబు తన ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేశారని తెలుస్తోంది.





Untitled Document
Advertisements