గ్యాప్ ఇవ్వకుండా వచ్చే ఎక్కిళ్ళకు లవంగాలతో చెక్ !

     Written by : smtv Desk | Thu, Jun 06, 2024, 03:07 PM

గ్యాప్ ఇవ్వకుండా వచ్చే ఎక్కిళ్ళకు లవంగాలతో చెక్ !

కొంతమందిలో అసలు గ్యాప్ ఇవ్వకుండా వచ్చే ఎక్కిళ్ళు చాలా ఇబ్బంది పెడుతుంటాయి. అయితే ఈ ఎక్కిళ్ళు రావడానికి వాతం చేసే ఆహారపదార్ధాలు గానీ, వేడి చేసే పదార్దాలు గానీ, అతిపుల్లని పదార్ధాలు గానీ, అరగని ఆహారం గానీ ఎక్కువగా తీస్కోవడం కారణం. పచ్చళ్ళు, కారాలు, మసాలాలు అతిగా తిన్నా ఎక్కిళ్ళు ఆగకుండా వస్తాయి. ఈ ఎక్కిళ్ళు కొందరికి రోజుల తరబడి నిలబడిపోతాయి కూడా. అయితే ఎక్కిల్లతో భాదపడే వారు ఈ చిట్కాలు పాటిస్తే ఎక్కిళ్ళు ఆగిపోతాయట.
* లవంగాన్ని బుగ్గన పెట్టుకుని చప్పరించండి. ఎక్కిళ్ళు ఆగుతాయి.
* ఏలకుల లోపలి గింజలు, పటికబెల్లం కలిపి నూరి ఓ చెంచా పొడిని పాలలో కలుపుకుని తాగండి.
* పిప్పల్లను నేతిలో వేయించి, తగినంత పంచదార వేసి మెత్తగా దంచి అర చెంచా పొడి నోట్లో వేసుకుని పాలుగాని, పులవని మజ్జిగ గానీ తాగితే ఎక్కిళ్ళు తగ్గుతాయి.
* పేరు నెయ్యిలో పంచదార వేస్కుని తినడం, గోరువెచ్చని పాలలో పంచదార వేసుకుని తాగిన ఎక్కిళ్ళు ఆగిపోతాయి.
* ఐస్ వేయకుండా చేసిని చెరుకురసం తాగిన ఎక్కిళ్ళు ఆగుతాయట .
* వెలగపండు గుజ్జులో పిప్పళ్ళ పొడిని కలుపుకుని తింటే ఎక్కిళ్ళు ఆగుతాయి.
* పచ్చళ్ళు పెట్టుకునే ఉసిరికాయలు తాజాగా దొరికితే వాటిని దంచి రసం తీసి నేతిలో వేయించిన పిప్పళ్ళ పోడి కలిపి తాగిన ఎక్కిళ్ళు ఆగిపోతాయి.
*ఎండు ఖర్జూరాలు, ఎండుద్రాక్ష, పిప్పళ్ళు, పంచదార ఈ నాలుగింటిని సమానంగా తీస్కోని అన్నింటిని కలిపి చక్కగా నూరి , ఒక చేమ్చాపోడిలో కొద్దిగా తేనె కలిపి తీస్కుంటే ఎక్కిళ్ళు ఆగిపోయి ఆయాసం తగ్గిపోతుందట .





Untitled Document
Advertisements