ముచ్చటగా మూడోసారి పీఎంవోకు మోదీ.. తొలిసంతకం ఆ ఫైల్ పైనే

     Written by : smtv Desk | Mon, Jun 10, 2024, 12:48 PM

ముచ్చటగా మూడోసారి పీఎంవోకు మోదీ.. తొలిసంతకం ఆ ఫైల్ పైనే

కేంద్రంలో మరోసారి బిజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆదివారం సాయంత్రం 71 మంది సహచరులతో నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ప్రధాన మంత్రి కార్యాలయంలోకి అడుగుపెట్టిన మోదీ.. రైతుల సంక్షేమానికి తొలి ప్రాధాన్యమిచ్చారు. పీఎం కిసాన్ నిధుల విడుదలకు సంబంధించిన ఫైల్ పై తొలి సంతకం పెట్టారు. ఈమేరకు ప్రధాన మంత్రి కార్యాలయం ఓ వీడియోను విడుదల చేసింది.

ముచ్చటగా మూడోసారి పీఎంవో లో అడుగుపెడుతున్న మోదీకి కార్యాలయ సిబ్బందితో పాటు పలువురు నేతలు ఘన స్వాగతం పలికారు. ఇరువైపులా నిల్చుని సంప్రదాయబద్దంగా నమస్కరిస్తూ మోదీకి వెల్కం చెప్పారు. సిబ్బంది అందరికీ నమస్కరిస్తూ మోదీ ప్రధానమంత్రి కార్యాలయంలోకి అడుగుపెట్టడం వీడియోలో చూడొచ్చు. తన సీటులో కూర్చున్న ప్రధాని మోదీ.. రైతులకు సంబంధించి పీఎం కిసాన్ నిధి 17వ విడత నిధులను విడుదల చేసేందుకు అనుమతిస్తూ ఫైల్ పై సంతకం పెట్టారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 9.3 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్లు జమయ్యాయి.






Untitled Document
Advertisements