కాబోయే ఏపీ సీఎం చంద్రబాబు కొరకు కాన్వాయ్ రెడీ

     Written by : smtv Desk | Mon, Jun 10, 2024, 12:55 PM

కాబోయే ఏపీ సీఎం చంద్రబాబు కొరకు కాన్వాయ్ రెడీ

కూటమిగా ఏర్పడి అత్యధిక స్థానాలలో గెలుపొంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు. ఇందుకోసం ఎన్నో అవమానాలను, కష్టాలను ఎదుర్కొన్నారు. కంటతడి సైతం పెట్టుకున్నారు. చివరకు అనుకున్నది సాధించారు. ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం అధికారులు ఇప్పటికే కొత్త కాన్వాయ్ ని సిద్ధం చేశారు. మొత్తం 11 వాహనాలను సిద్ధం చేసి తాడేపల్లిలోని ఇంటెలిజెన్స్ కార్యాలయంలో పార్క్ చేశారు. ఇందులో రెండు వాహనాలు జామర్ల కోసమని అధికారులు వివరించారు. టయోటా కంపెనీకి చెందిన ఈ వాహనాలు అన్నీ నలుపు రంగులో, 393 నెంబర్ తో సిద్ధమయ్యాయి. కాగా, ఈ నెల 12న ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.





Untitled Document
Advertisements