వర్జిన్ కోకోనట్ ఆయిల్ గుర్తించడమెలా?

     Written by : smtv Desk | Tue, Jun 11, 2024, 06:12 PM

వర్జిన్ కోకోనట్ ఆయిల్ గుర్తించడమెలా?

మార్కెట్లో రెండు రకాల కొబ్బరి నూనెలు అందుబాటులో ఉంటాయి అనే విషయం మనలో చాలామందికి తెలియదు . వాటిలో ఒకటి వర్జిన్ కోకోనట్ ఆయిల్.. ఇంకోకటి రెగ్యులర్‌గా ఉపయోగించే కొబ్బరి నూనె. ఒకవేళ రెండు రకాల నూనెలు ఉంటాయి అని తెలిసినా, ఈ రెండిటికీ మధ్య ఉండే తేడా ఏమిటో చాల వరకు మనకి తెలియదు.ఈ కొబ్బరి నూనెలు రెండూ చూసేందుకు ఒకేలా ఉంటాయి. కానీ, చాలా భిన్నమైనవి. మరి వీటి మధ్య ఉండే తేడా ఏమిటో చూసేద్దామా!
❂ వర్జిన్ కొబ్బరి నూనెకు, సాధారణ కొబ్బరి నూనెల తయారీలో చాలా తేడా ఉంది. వర్జిన్ కొబ్బరి నూనెను పచ్చిగా ఉండే కొబ్బరి పాలతో తయారు చేస్తారు.
❂ సాధారణ కొబ్బరి నూనెను ఎండబెట్టి, నుజ్జు చేయడం ద్వారా ఆయిల్‌ను సంగ్రహిస్తారు.
❂ వర్జిన్ కొబ్బరి నూనెను ‘కోల్డ్-ప్రాసెస్డ్ టెక్నాలజీ’తో తయారు చేస్తారు.
❂ సాధారణ కొబ్బరినూనెను ఎండ ఎండబెట్టడం వల్ల తాపనకు గురై సహజ పోషకాలు నశిస్తాయి.
❂ వర్జిన్ కొబ్బరి నూనె తాపనకు గురికాదు. ఫలితంగా అందులోని పోషకాలకు ఎలాంటి నష్టం ఉండదు.
❂ వర్జిన్ కొబ్బరి నూనెలో యాంటీఆక్సిడెంట్లకు ఎలాంటి నష్టం ఉండదు.
❂ ఈ రెండు కొబ్బరి నూనెల మధ్య స్వల్ప వ్యత్యాసమే ఉంటుంది.
❂ సాధారణ కొబ్బరి నూనె హైడ్రోజనేటెడ్ కావడం వల్ల అందులో కొన్ని కొవ్వులు ఉండవచ్చు.
❂ పచ్చి కొబ్బరి పాల నూనెలో మధ్యస్థ కొవ్వు ఆమ్లాలు, మంచి కొవ్వులు ఉంటాయి.
❂ వర్జిన్ కొబ్బరి నూనెకు రంగు కాస్త ఎక్కువ.
❂ సాధారణ కొబ్బరి నూనెతో పోల్చితే వర్జిన్ కొబ్బరి నూనెకు జిడ్డు ఉండదు, రుచి, వాసన కూడా బాగుంటుంది.
❂ సాధారణ కొబ్బరి నూనెలో సహజ గుణాలు తక్కువ. కృత్రిమ సువాసన, రుచి ఉంటుంది.
ఆరోగ్యానికి ఏది మంచిది?:
వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఆరోగ్యానికి మంచిదని ఖచ్చితంగా చెప్పేందుకు ప్రస్తుతం ఎలాంటి రుజువులు లేవు. అయితే, కొన్ని అధ్యయనాల ప్రకారం.. బరువు తగ్గేందుకు ప్రయత్నించేవారు వర్జిన్ కోకోనట్ ఆయిల్ వాడితే మంచిదని తెలుపుతున్నారు. ఇది మంచి మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ లోషన్‌గానే కాకుండా కొన్ని రకాల చర్మ సమస్యలను కూడా పరిష్కరిస్తుందని చెబుతున్నారు. అయితే, వీటికి తగిన ఆధారాలు లేవు. కాబట్టి.. ఈ నూనెలను డైట్‌లో భాగం చేసుకోవాలన్నా, చర్మం, జుట్టు సంరక్షణకు ఉపయోగించాలన్నా.. నిపుణులు, వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవడం ఉత్తమం. లేకుంటే సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు.





Untitled Document
Advertisements