షుగర్ వచ్చిన వారు అన్నం ఎందుకు తినకూడదంటే?

     Written by : smtv Desk | Thu, Jun 13, 2024, 12:52 PM

షుగర్ వచ్చిన వారు అన్నం ఎందుకు తినకూడదంటే?

ఒక్కసారి మన శరీరంలోకి షుగర్ వచ్చిందంటే జీవితాంతం జాగ్రత్తగా ఉండాల్సిందే. అలా కాదు నా ఇష్టానికి జీవిస్తాను, నచ్చింది తింటాను అంటే మన బాడీలోకి మనమే రోగాలని ఆహ్వానించినట్లు అవుతుంది. షుగర్ వచ్చినవారు ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా రాత్రి భోజనం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కనుక అన్నం తినకపోవడం ఉత్తమం. అన్నంకి ప్రత్యామ్నాయంగా జొన్నరొట్టెలు, రాగిజావ వంటివి అలవాటు చేసుకోవడం మంచిది అని మన పెద్దలు చెబుతుంటారు. అయితే వారు అన్నం తినకూడదు అని చెప్పడానికి గల కారాణాలు ఏంటి అనే తెలుసుకుందాం..

అన్నం తింటే.. రోజూ అన్నం తింటే షుగర్ పెరిగే అవకాశం ఉంది. బియ్యంలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అన్నం ఎక్కుగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇప్పటికే షుగర్ ఉంటే వైట్‌రైస్ వద్దు. వైట్ రైస్‌తో పోలిస్తే మన ఆరోగ్యానికి బ్రౌన్‌రైస్ మంచిది.

ఎందుకు వద్దు.. టైప్ 2 షుగర్ ఉన్నవారికి శరీరం ఇన్సులిన్ నిరోధకతని కలిగి ఉంటుంది. రక్తంలో చక్కెర పెరుగుదలని సరిగ్గా భర్తీ చేయడానికి తగినంతగా ఉత్పత్తి చేయకపోవచ్చు. కాబట్టి.. రోజంతా కార్బోహైడ్రేట్స్ తినొచ్చు. రాత్రుళ్ళు మాత్రం వైట్‌రైస్ బదులు బ్రౌన్‌రైస్, క్వినోవా, ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి.

ఎక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్.. తెల్లబియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే త్వరగా జీర్ణమై రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచుతుంది. రాత్రిపూట జీవక్రియని మందగిస్తుంది. కాబట్టి, ఎక్కువగా GI ఫుడ్స్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

జీర్ణ సమస్యలు.. బియ్యంలో ఫైబర్ ఉండదు. కానీ, అధిక చక్కెర స్థాయిల కారణంగా జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది. షుగర్ ఎక్కువగా ఉంటే కాలేయం దెబ్బతింటుంది. కాబట్టి, రాత్రుళ్ళు వైట్ రైస్ బదులు, సలాడ్స్, బ్రౌన్‌రైస్, క్వినోవా వంటివి తినడం మంచిది.

బరువు పెరగడం.. బరువు పెరగడం అనేది మీరు ప్రతిరోజూ తినే ఆహారం, మీ శరీరంలోని సరైన జీవక్రియ, శోషణ, మీ జీవితంలో ఒత్తిడి స్థాయిలపై ఆధారపడి ఉంటుంది. తెల్లబియ్యంలో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బియ్యంలో అధిక కేలరీలు, కార్బోహైడ్రేట్స్ కారణంగా, బరువు పెరుగుతుంది. డయాబెటిక్ ఉన్నవారికి బరువు పెరగడం హానికరం.

సరైన ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయామం చేస్తూ, ఒత్తిడికి గురికాకుండా జాగ్రత్త పడితే ఆరోగ్యంగా జీవించవచ్చు.





Untitled Document
Advertisements