జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే యోగాలో ఈ ఆసనాలు బెస్ట్!

     Written by : smtv Desk | Thu, Jun 13, 2024, 01:09 PM

జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే యోగాలో ఈ ఆసనాలు బెస్ట్!

ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధంలేకుండా రకరకాల అనారోగ్య సమస్యలు రావడం. చర్మం ముడతలు పడడం, జుట్టు తెల్లబడడం, వయసు పై బడినట్టు కనిపించడం అనేది చాలా ఎక్కువ మందిలో కనిపిస్తుంది. అయితే దీనికి గల కారణాలు ఏంటి అంటే ప్రధానంగా మారిన జీవన శైలీ, ఆహారపు అలవాట్లు. అయితే ఈ సమస్యల నుండి బయట పడాలి అంటే ఆహరం విషయంలో మార్పులు చేసుకుని రోజు యోగా, ధ్యానం వంటివి చేయడం మంచిది.

ముఖ్యంగా యోగా చేయడం వల్ల చాలా లాభాలున్నాయి. అందులో ఒత్తిడి తగ్గడం, రక్త ప్రసరణ మెరుగవుతుంది, హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడం, తెల్లజుట్టుని తగ్గించడం వంటి మార్పులు గమనించవచ్చు.

వీటన్నింటి వల్ల ఒత్తిడి తగ్గి జుట్టు రాలడం, తెల్లబడే సమస్య తగ్గుతుంది. దీంతో పాటు.. బ్రీథింగ్ వర్కౌట్స్, ధ్యానం, మైండ్‌ఫుల్‌నెస్ పద్ధతుల ద్వారా ఒత్తిడి తగ్గి జుట్టు రాలడం, జుట్టు నెరసిపోవడం, జుట్టు పెరుగుదలకి హెల్ప్ చేస్తుంది. దీంతోపాటు ఇమ్యూనిటీని మెరుగ్గా చేసి, జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది. మొత్తం అందుకోసం ఏయేయ ఆసనాలు ఉన్నాయో తెలుసుకోండి.

ఫార్వర్డ్ బెండ్.. ఈ ఆసనం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. విశ్రాంతిని ప్రోత్సహించి ఒత్తిడిని తగ్గిస్తుంది. దీని వల్ల జుట్టు పెరుగుతుంది.

ఉష్టాసన.. ఈ ఆసనం చేయడం వల్ల ఛాతీ ఎక్స్‌పాండ్ అవుతుంది. తలలో రక్త ప్రసరణని పెంచుతుంది. ఒత్తిడి, ఆందోళనని తగ్గిస్తుంది. జుట్టు ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది.

అధోముఖ స్వనాసన.. ఈ భంగిమ తలలో రక్తప్రసరణని పెంచి జుట్టు పెరుగుదలని ప్రేరేపిస్తుంది. దీనిని చేయడం వల్ల ఒత్తిడి నుంచి రిలాక్స్ అవుతారు. ఇది జుట్టు పెరిగేందుకు హెల్ప్ చేస్తుంది.

సర్వాంగాసనం.. ఈ ఆసనం చేయడం వల్ల తలకి రక్త ప్రసరణ పెరిగి జుట్టు కుదుళ్ళకి పోషణ అందుతుంది. హెల్దీగా జుట్టు పెరుగుదలకి కీలక హార్మోన్స్‌ని కంట్రోల్ చేసి ఒత్తిడిని తగ్గించేందుకు హెల్ప్ చేస్తుంది.

శవాసన.. ఈ ఆసనం చేయడం వల్ల విశ్రాంతి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. మొత్తం ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది. ఒత్తిడిని తగ్గించి జుట్టుని పెంచుతుంది. రెగ్యులర్‌గా చేయడం వల్ల జుట్టు సమస్యలు దూరమై జుట్టు పొడుగ్గా పెరుగుతుంది.

హెడ్ స్టాండ్.. దీనినే శీర్షాసన అంటారు. దీని వల్ల తలకి రక్తప్రసరణని పెంచి విలోమ భంగిమ, జుట్టు కుదుళ్ళకి పోషకాలు, ఆక్సీజన్ అందుతుంది. దీని వల్ల జుట్టు పెరుగుతుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. హెల్దీ జుట్టుకి అవసరమైన హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది.






Untitled Document
Advertisements