చెడుకొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడాలంటే ఈ టీ బెస్ట్ !

     Written by : smtv Desk | Fri, Jun 14, 2024, 12:12 PM

చెడుకొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడాలంటే ఈ టీ బెస్ట్ !

ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లు, జీవన శైలిని బట్టి రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. అయితే హెల్దీగా ఉన్న వ్యక్తికి గుండె సమస్యలు రావు. దీనికి కారణం వారి లైఫ్‌‌స్టైల్. చక్కని లైఫ్‌స్టైల్, అలవాట్ల కారణంగా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మనం తీసుకునే ఆహారం కారణంగా చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతాయి. మంచి కొలెస్ట్రాల్ గుండెకి మంచిది. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే గుండెకి ప్రమాదం. అయితే, ఇలాంటి వాటికి చెక్ పెట్టాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అందుల్లో బ్లాక్ జింజర్ టీ ఒకటి. దీనిని ఎలా తీసుకోవాలి.. తీసుకుంటే ఎలాంటి లాభాలున్నాయో తెలుసుకోండి.

బ్లాక్ జింజర్ టీ.. చాలా మందికి జింజర్ టీ గురించి తెలుసు. కానీ, బ్లాక్ జింజర్ టీ గురించి తెలియదు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. అంటే ఫ్రీ రాడికల్ ఎలిమెంట్స్‌తో పోరాడతాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీర కణాలకు ఎలాంటి హాని జరగకుండా నిరోధించి, వాపుని తగ్గిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.

ఒత్తిడి తగ్గడం.. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారిలో కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతాయి. దీని వల్ల గుండె సమస్యలొస్తాయి. అదే మనం బ్లాక్ జింజర్ టీ తాగితే మానసిక ఒత్తిడి తగ్గి బాడీ రిలాక్స్ అవుతుంది.

బరువు తగ్గడం.. బ్లాక్ జింజర్ టీ తాగితే కొలెస్ట్రాల్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. ఇవి మన జీవక్రియ ప్రక్రియని మెరుగ్గా చేసి ఆకలిని కంట్రోల్ చేస్తాయి. కాబట్టి, కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది.

లివర్ క్లీన్ అవ్వడం.. ఉదయాన్నే పరగడపున ఖాళీ కడుపుతో నల్ల అల్లం టీ తాగితే మంచిది. ఎందుకంటే, ఇది లివర్ పనితీరుని మెరుగ్గా చేస్తుంది. జీవక్రియ ప్రక్రియని మెరుగ్గా చేసి లివర్‌ని క్లీన్ చేస్తుంది. కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేయడానికి కూడా మంచిది.

శరీరంలో మంట.. బ్లాక్ జింజర్ టీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దీనిని రెగ్యులర్‌గా తాగితే శరీరంలోని మంటని తగ్గించి చెడు కొలెస్ట్రాల్ స్థాయిని కంట్రోల్ చేస్తాయి. దీని వల్ల మన గుండె ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి, రెగ్యులర్‌గా ఈ టీని తాగడం మంచిది.

చెడు కొలెస్ట్రాల్.. మీరు మీ శరీరంలోని కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవాలనుకుంటే బ్లాక్ అల్లం టీని తాగడం మంచిది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. నల్ల అల్లంలో బయోయాక్టివ్ ఎలిమెంట్స్ ఉంటాయి ఇవి మన ప్రేగులలో కొలెస్ట్రాల్ శోషణని నిరోధిస్తాయి. దీంతో సహజంగానే చెడు కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది.





Untitled Document
Advertisements