హెయిర్ ప్రాబ్లమ్స్ కు నాచురల్ రెమెడీస్ మీకోసం..

     Written by : smtv Desk | Thu, Jun 27, 2024, 03:35 PM

హెయిర్ ప్రాబ్లమ్స్ కు నాచురల్ రెమెడీస్ మీకోసం..

ప్రస్తుతకాలంలో బ్యూటీ ప్రొడక్ట్స్, పార్లర్స్ అడుగడుగునా కనిపిస్తున్నాయి. అందంగా కనిపించడానికి అనేక రకాల బ్యూటీ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇన్ని కెమికల్ ఆప్షన్స్ అందుబాటులో లేనప్పుడు చిన్న చిన్న బ్యూటీ ప్రాబ్లమ్స్ అన్నింటికీ నాచురల్ ఇన్‌గ్రీడియెంట్స్ లోనే సొల్యూషన్స్ దొరికేవి. హెయిర్ ప్రాబ్లమ్స్ అయినా అంతే. కెమికల్స్ తో నిండి ఉన్న ప్రోడక్ట్స్ ని హెయిర్ కి అప్లై చేస్తే ఇమ్మీడియెట్ గా మంచి ఫలితాలే ఉండవచ్చు కానీ, ఈ ప్రోడక్ట్స్ లాంగ్ రన్ లో హెయిర్ ని బాగా డ్యామేజ్ చేస్తాయి. అదృష్టవశాత్తూ హెయిర్ కి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ కి నాచురల్ రెమెడీస్ ఉన్నాయి. ఈ రెమెడీస్ పాటించటం వలన సమస్య పరిష్కారమవ్వడమే కాక హెయిర్ కి కెమికల్ ప్రోడక్ట్స్ వాడడం వలన పోయిన క్వాలిటీ కూడా తిరిగి వస్తుంది. ఇలా హెయిర్ కి నాచురల్ క్వాలిటీని రిస్టోర్ చేయడానికి కావాల్సిన ఇన్‌గ్రీడియెంట్స్ అన్నీ ఇంట్లోనే ఉంటాయి కూడా. అవేమిటో, వాటిని ఎలా వాడాలో చూడండి మరి.
* గ్రీన్ టీ ని సూపర్ ఇన్‌గ్రీడియెంట్ అనడానికి ఒక రీజన్ ఉంది. ఇందులో పాలిఫెనాల్స్, విటమిన్స్ ఈ, సీ వంటివి పుష్కలం గా ఉంటాయి. ఈ పవర్‌ఫుల్ ఇన్‌గ్రీడియెంట్స్ అన్నీ కలిసి హెయిర్ ఫాలికిల్స్ కి బ్లడ్ సర్క్యులేషన్ ని బూస్ట్ చేస్తాయి. ఫలితంగా, స్కాల్ప్ హెల్దీ గా తయారవుతుంది. ఇందులో ఉండే కెఫీన్ హెయిర్ గ్రోత్ ని స్టిమ్యులేట్ చేస్తే, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ క్వాలిటీస్ హెయిర్ లాస్ ని రెడ్యూస్ చేస్తాయి. ఒక కప్పు గ్రీన్ టీ లో ఒక ఎగ్ యోక్ కలిపి రన్నీ హెయిర్ మాస్క్ తయారు చేయండి. టీ రూమ్ టెంపరేచర్ లోనే ఉండేలా జాగ్రత్తపడండి. జుట్టు కుదుళ్ళ నుండీ చివరల వరకూ సమానం గా అప్లై చేయండి. ఒక రెండు గంటలు అలా వదిలేసి తలస్నానం చేయండి.
* మీకు డ్రై హెయిర్, డ్యామేజ్డ్ హెయిర్ ఉంటే మీకు తేనె కావాలి. తేనె జుట్టుని శుభ్రంగా క్లీన్ చేస్తుంది, మాయిశ్చరైజ్ చేస్తుంది, బలంగా చేస్తుంది, బ్యాక్టీరియాతో పోరాడుతుంది. కొద్దిగా తేనె, ఆలివ్ ఆయిల్ కలిపి హెయిర్ మాస్క్ తయారు చేయండి. కొద్దిగా వెచ్చబెట్టి వారానికి ఒకసారి అప్లై చేయండి. అప్లై చేసిన అరగంట తరువాత శుభ్రంగా వాష్ చేయండి, లేదా తేనె జుట్టులో మిగిలిపోతుంది.
* అందరికీ అందుబాటులో ఉండే హెయిర్ కీ స్కిన్ కీ కామన్ ఫ్రెండ్ ఏమిటంటే కొబ్బరి నూనే. కొబ్బరి నూనెలో విటమిన్స్, ఎస్సెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ ఉన్నాయి. ఇవి హెయిర్ ని స్మూత్ గా చేస్తాయి. బలహీనంగా తయారైన జుట్టుని బాగు చేస్తాయి. కొబ్బరి నూనె ని కొద్దిగా వెచ్చబెట్టి వారానికి ఒకసారి తలకి మసాజ్ చేయండి. ఆ తరువాత వెచ్చని టవల్ తో జుట్టుని కవర్ చేయండి. నాచురల్ షాంపూ తో హెయిర్ వాష్ చేస్తే జుట్టు స్మూత్ గా షైనీ గా ఉంటుంది.
* డ్యామేజ్డ్ హెయిర్ కి నాచురల్ సొల్యూషన్ కోసం మీరు చూస్తున్నట్లైతే మీకు కావాల్సిన సూపర్ ఇన్‌గ్రీడియెంట్ కోకోవా బటర్. ఇందులో పుష్కలంగా ఉండే హెల్దీ ఫ్యాట్స్ వల్ల జుట్టుకి కావాల్సిన పోషణ లభిస్తుంది. దీని వల్ల జుట్టుకి కావాల్సిన తేమ లభిస్తుంది. జుట్టుకి కోకోవా బటర్ అప్లై చేసి అరగంట ఆగి మైల్డ్ నాచురల్ షాంపూ తో హెయిర్ వాష్ చేసుకోండి. వెచ్చని టవల్ లో జుట్టుని కవర్ చేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితం వస్తుంది.
* చార్‌కోల్ కి ఇంప్యూరిటీస్ ని అబ్జార్బ్ చేసుకుని డీప్ క్లీన్ చేసే ప్రాపర్టీస్ ఉన్నాయి. మీకు ఆయిలీ స్కాల్ప్ ఉండి దానితో పాటూ చుండ్రూ దురదా ఉంటే మీరు చార్‌కోల్ క్లీన్ ని ఆప్ట్ చేసుకోండి. యాక్టివేటెడ్ చార్‌కోల్ పౌడర్ ని అలో వెరా జెల్ తో కలిపి హెయిర్ మాస్క్ తయారు చేయండి. మరీ రన్నీగా ఉండకుండా జాగ్రత్తపడండి. అలోవెరా స్కాల్ప్ ని హైడ్రేట్ చేస్తుంది. కొద్దిగా తడిగా ఉన్న స్కాల్ప్, స్ట్రాండ్స్ మీద ఈ మిశ్రమాన్ని సమానంగా అప్లై చేయండి. ఇరవై నిమిషాలు వదిలేయండి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో నాచురల్ షాంపూతో వాష్ చేసేయండి. ఎన్ని చేసిన కూడా సరైన ఫలితం కావాలంటే సమతుల ఆహారం,సరిపడా నీళ్ళు తీసుకుంటూ సరైన నిద్రపోవడం తప్పనిసరి.





Untitled Document
Advertisements