స్కిన్ ప్రాబ్లెమ్స్ కు ముల్తానీ మట్టి బెస్ట్ ఆప్షన్..

     Written by : smtv Desk | Thu, Jun 27, 2024, 03:43 PM

వర్షాకాలం వచ్చేసింది. చర్మం మరియు జుట్టు ఆరోగ్యం కొరకు సమ్మర్ అలాగే వింటర్ సీజన్ల కంటే స్కిన్ కు ఎడిషనల్ కేర్ అనేది వర్షాకాలంలో మరింత ముఖ్యం. వాతావరణంలో తేమ అనేది స్కిన్ ను మరింత కన్ఫ్యూజన్ కు గురిచేస్తుంది. కాబట్టి, స్కిన్ అనేది వివిధ రకాలుగా రియాక్ట్ అవుతుంది. దాంతో, యాక్నే, బ్రేకవుట్, డ్రై పాచెస్, పింపుల్స్ వంటి సమస్యలు మొదలవుతాయి. అందుకే, స్కిన్ కండిషన్ ను తెలుసుకుని తగిన కేర్ తీసుకోవాలి. స్కిన్ కేర్ విషయంలో ముల్తానీ మట్టికున్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అన్నిరకాల స్కిన్ ట్రబుల్స్ కు ముల్తానీ మట్టితో పరిష్కారం లభిస్తుంది. ముల్తానీ మట్టికున్న గొప్పతనం ఏంటంటే స్కిన్ ప్రాబ్లెమ్ ను తగినట్టుగా దీనిలో ఇంగ్రిడియెంట్స్ ను కలిపి కస్టమైజ్డ్ ఫేస్ ఫ్యాక్స్ ను తయారుచేసుకుని దీని బెనిఫిట్స్ ను పొందవచ్చు.
ముల్తానీమట్టిని స్క్రబ్ గా వాడవచ్చు. ముల్తానీ మట్టిలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ సర్కులేషన్ ను ఇంప్రూవ్ చేస్తుంది. కొత్త సెల్స్ గ్రోత్ ను పెంపొందిస్తుంది. దాంతో స్కిన్ ప్రకాశవంతంగా ఉంటుంది. ముల్తానీమట్టితో స్క్రబ్బింగ్ చేస్తే డెడ్ సెల్స్ సమస్య తొలగిపోతుంది. స్కిన్ కు వైబ్రెంట్ లుక్ లభిస్తుంది. డార్క్ సర్కిల్స్ ను తగ్గించేందుకు కూడా ముల్తానీ మట్టి హెల్ప్ చేస్తుంది. ఇందులో నిమ్మరసం అలాగే పెరుగును కలిపి పేస్ట్ లా అప్లై చేసి డార్క్ సర్కిల్స్ పై అప్లై చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇరవైనిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత వాష్ చేయాలి. అలాగే ఈ ముల్తానీమట్టిని ముఖంపై రోజూ వాడకూడదు. అతిగా వాడితే, ఇది స్కిన్ లోని నేచురల్ మాయిశ్చరైజర్ ను కోల్పోయేలా చేస్తుంది. స్కిన్ పొడిబారుతుంది. వారంలో రెండు సార్లు వాడవచ్చు.
డ్రై స్కిన్ ఉన్నట్టయితే కాస్తంత ముల్తానీ మట్టిని తీసుకుని అందులో కొంత అలోవెరా జెల్ ను అలాగే తేనెను కలపండి. రెండు టీస్పూన్స్ ముల్తానీ మట్టిలో ఒక టీస్పూన్ తేనె అలాగే ఒక టీస్పూన్ అలోవెరా జెల్ ను కలపాలి. ఈ పదార్థాలని బాగా కలిపి స్మూత్ పేస్ట్ ను తయారుచేసుకోవాలి. ఇప్పుడు, ఈ పేస్ట్ ను ముఖానికి అలాగే మెడకు అప్లై చేయాలి. ఇరవై నిమిషాలపాటు అలాగే వదిలేయాలి. దానంతట అది ఆరిపోయాక ఫేస్ ను నీళ్లతో కడగాలి. మాయిశ్చరైజర్ ను జెంటిల్ గా అప్లై చేయాలి. ఇలా వారానికి ఒక్కసారి ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ ను డ్రై స్కిన్ ను సాఫ్ట్ గా సపిల్ గా చేయాలంటే ముల్తానీ మట్టిలో ఇంకొన్ని ఇంగ్రిడియెంట్స్ ను కూడా కలపాలి. ముల్తానీమట్టి ఫేస్ ప్యాక్ అనేది డ్రై మరియు డల్ స్కిన్ లో రేడియేన్స్ ను జోడించాలంటే ఈ ఇంగ్రిడియెంట్స్ ను కలపాలి. ఒక స్పూన్ బాదాం పాపు పొడి అలాగే అరకప్పుమిల్క్ ను ముల్తానీమట్టిలో కలిపి మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి. ముఖానికి అప్లై చేసి ముప్పై నిమిషాలపాటు అలాగే వదిలేయాలి. ఆ తరువాత వాష్ చేయాలి.
సెబమ్ ఎక్కువగా ప్రొడ్యూస్ ఐతే స్కిన్ ఆయిలీగా మారుతుంది. స్కిన్ ను పర్యావరణ కాలుష్యకారకాల నుంచి రక్షించాలంటే సెబమ్ అనేది ముఖ్యం. ఐతే, ఇది అత్యధికంగా ప్రొడ్యూస్ అయినప్పుడు మాత్రం అనేక స్కిన్ ఇష్యూస్ వస్తాయి. ఆయిలీ స్కిన్ ఐతే స్కిన్ పై డర్ట్ ఎక్కువగా పేరుకుంటుంది. రాను రాను స్కిన్ డల్ గా మారిపోతుంది. దీనివల్ల యాక్నే, పింపుల్స్ అలాగే స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అదనపు సెబమ్ చుట్టుపక్కలున్న ఇంప్యూరిటీస్ ను అట్రాక్ట్ చేసి స్కిన్ పోర్స్ ను బ్లాక్ చేస్తుంది.
ఆయిలీ స్కిన్ ఉన్నవారికి ముల్తానీ మట్టి ఎన్నో విధాలుగా హెల్ప్ అవుతుంది. కేవలం ఒకే ఒక్కసారి అప్లై చేసినప్పటి నుంచే స్కిన్ లోని సెబమ్ ప్రొడక్షన్ కంట్రోల్ అవడాన్ని గుర్తించగలుగుతారు. ఇది స్కిన్ పోర్స్ క్లాగ్ అవకుండా సంరక్షిస్తుంది. స్కిన్ స్మూత్ గా అలాగే సాఫ్ట్ గా మారడానికి హెల్ప్ చేస్తుంది. ఆయిలీ స్కిన్ ఉన్నవారికి పింపుల్స్ ఎక్కువగా వస్తాయి. అందుకే, వారికి స్కిన్ సూతింగ్ ఇంగ్రిడియెంట్స్ అవసరం.






Untitled Document
Advertisements