మీ చర్మాన్ని బట్టి క్లెన్సర్ ని ఎంచుకొండిలా..

     Written by : smtv Desk | Thu, Jun 27, 2024, 03:38 PM

మీ చర్మాన్ని బట్టి క్లెన్సర్ ని ఎంచుకొండిలా..

అందమైన ఆరోగ్యకరమైన మెరిసే చర్మం కావాలి అనేది ప్రతి ఒక్కరి కోరిక. అయితే హెల్దీ స్కిన్ కోసం చేయవలసిన మొట్టమొదటి పని క్లెన్సింగ్ చేయడం. ఏదో ఫ్యాన్సీ స్కిన్ క్లెన్సర్ కాకుండా ఒక జెంటిల్ క్లెన్సర్ మీద ఇన్వెస్ట్ చేయండి. "పీహెచ్ బాలెన్స్డ్", "సల్ఫేట్ ఫ్రీ", "సోప్ ఫ్రీ" వంటివి క్లెన్సర్ యొక్క డిస్క్రిప్షన్ లో ఉన్నాయంటే అవి జెంటిల్ క్లెన్సర్స్ అని అర్ధం చేసుకోవచ్చు. రాత్రి నిద్రకి ముందు క్లెన్స్ చేసుకుంటే స్కిన్ రిపెయిర్ కి అది హెల్ప్ చేస్తుందని నిపుణుల సలహా. ఇది సింపుల్ రొటీనే కానీ, చక్కని రిజల్ట్ ని మాత్రం ఇస్తుంది.
మాయిశ్చరైజర్ ని ఎప్పుడూ మీ స్కిన్ టైప్ కి అనుగుణంగా సెలెక్ట్ చేసుకోవాలి. డ్రై స్కిన్ ఉన్న వారు థిక్ గా, ఎక్కువ హైడ్రేటింగ్ గా ఉండే మాయిశ్చరైజర్ ని ఎంచుకుంటే, ఆయిలీ స్కిన్ ఉన్న వారు లైట్ వెయిట్, నాన్ - గ్రీజీ, ఆయిల్ - ఫ్రీ ఆప్షన్స్ ని ఎంచుకోవచ్చు. మీది సెన్సిటివ్ స్కిన్ అయితే ఆల్కహాల్, ఫ్రాగ్రెన్సెస్ లేని మాయిశ్చరైజర్ చూజ్ చేసుకోండి. లేదంటే, బ్రేకౌట్స్, బ్లెమిషెస్ వచ్చే అవకాశం ఉంది. మాయిశ్చరైజర్ ని పొద్దున్న ఒకసారీ, రాత్రి ఒకసారీ అప్లై చేయడం మంచిది.
స్కిన్ కి జరిగే డ్యామేజ్ లో అధిక భాగం సన్ రేస్ వల్లే జరుగుతుంది. అల్ట్రా వయొలెట్ రేస్ స్కిన్ ని అన్ని సీజన్స్ లోనూ ఎఫెక్ట్ చేస్తాయి. అందుకే, ఎస్సెషియల్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ లో సన్‌స్క్రీన్ కంపల్సరీ గా ఉండాలి. ఎస్‌పీఎఫ్ ముప్ఫై నుండి యాభై వరకూ ఉన్న సన్‌స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండ్ద్ది, రోజూ అప్లై చేయడం మాత్రం మర్చిపోకండి.
స్కిన్ మీద పేరుకునే జిడ్డూ, మురికీ అక్కడే కలెక్ట్ అయ్యి డెడ్ స్కిన్ సెల్స్ కి కారణం అవుతాయి. సాధారణంగా స్కిన్ డెడ్ సెల్స్ ని వదిలించేస్తుంది, కానీ అన్ని సార్లూ అలా జరగకపోవచ్చు. ఇందు వల్ల స్కిన్ మీద డ్రై, ఫ్లేకీ పాచెస్ ఏర్పడుతాయి, పోర్స్ బ్లాక్ అవ్వచ్చు కూడా. ఇలా జరగడాన్ని ప్రివెంట్ చేయాలంటే మీ స్కిన్ టైప్ కి సరిపోయే ఎక్స్ఫోలియటర్ లేదా స్క్రబ్ యూజ్ చేయాలి. ఈ ప్రోడక్ట్ ని వారానికి రెండు మూడు సార్లు డెడ్ స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేయడానికి వాడవచ్చు.
స్కిన్ సన్‌రేస్, డస్ట్, పొల్యూషన్ కి ఎక్స్పోజ్ అవుతున్న కొద్దీ స్కిన్ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. ఫైన్ లైన్స్, డార్క్ స్పాట్స్ తో మొదలై, అన్ఈవెన్ స్కిన్ టోన్ వరకూ ఈ డ్యామేజ్ స్కిన్ మీద కనపడుతూ ఉంటుంది. ఒక మంచి యాంటీ ఏజీయింగ్ ప్రోడక్ట్ ఈ డ్యామేజ్ ని సరి చేస్తుంది. మీ స్కిన్ టిష్యూ ని బేస్ చేసుకుని మీరు సీరమ్స్ ని ఎక్స్ప్లోర్ చేయవచ్చు. విటమిన్ సీ, రెటినాల్ వంటి ఇన్‌గ్రీడియెంట్స్ ఉన్న సీరమ్స్ స్కిన్ యొక్క ఓవరాల్ టెక్స్చర్ ని ఇంప్రూవ్ చేయడం లో హెల్ప్ చేస్తాయి.





Untitled Document
Advertisements