వర్కౌట్స్ చేయడానికి సరైన సమయం ఏదంటే..?

     Written by : smtv Desk | Thu, Jun 27, 2024, 03:28 PM

వర్కౌట్స్ చేయడానికి సరైన సమయం ఏదంటే..?

మీకు వ్యాయామాలు, వర్కౌట్స్ అలవాటు లేకపోతే, వీటిని ప్రారంభించడానికి ఇదే సరైన సమయం. ఒకవేళ మీకు ఈ వర్కౌట్స్ అలవాటు ముందే ఉంటే మాత్రం, ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, ఒక ప్రణాళికను సిద్దం చేసుకోండి. చాలా వరకు ఉదయాన్నే లేచి, జాగింగ్, వర్కౌట్లకు సమయం కేటాయించే అవకాశమే ఉండకపోవచ్చు. నైట్ షిఫ్టులు, ఆఫీస్, కాలేజ్ టైమింగ్స్ ఇలా వంద కారణాలు అడ్డంగా ఉంటాయి. కానీ ఒక అధ్యయనం ప్రజల్లో పాతుకుపోయిన ఒక అపోహను పూర్తిగా తుడిచేసింది. చాలా వరకు కేవలం ఉదయం చేసే వర్కౌట్స్ మాత్రమే ప్రయోజనాలను ఇస్తాయని భావిస్తుంటారు. కానీ, అది అపోహ మాత్రమే అని ఈ అధ్యయనం తేల్చింది.
రోజూ ఉదయాన్నే మార్నింగ్ రొటీన్ల కన్నా ముందుగా, నిద్రలేవడమే జాగింగ్, వార్కౌట్స్ కోసం సమయం కేటాయించే వారి కన్నా, తమ ఆరోగ్యాన్ని అనుసరించి, “మార్నింగ్ రోటీన్స్” పూర్తయ్యాకనే జిమ్ వర్కౌట్లు చేసేవారు అద్భుతమైన జీవక్రియలను, ఫిట్‌నెస్ కలిగి ఉన్నారని తేల్చింది. అది కూడా శీతాకాలంలో మరింత మెరుగ్గా ఆరోగ్యాన్ని నిర్వహించగలుగుతారని నివేదికలో చెప్పింది. అనగా, మార్నింగ్ రోటీన్స్ పూర్తయ్యాక, శరీరం జీవక్రియలకు అనువుగా మారుతుంది. ఆపై మీరు అనుసరించే వర్కౌట్స్ మీ మెదడులో హాపీ హార్మోన్ల స్థాయిలను పెంచడంలో సహాయపడుతాయని పేర్కొంది.
సైకాలజిస్టుల ప్రకారం వ్యాయామం, మానసిక ఆరోగ్యం మధ్య అవినాభావ సంబంధం ఎక్కువగా ఉందని చెప్తున్నారు. అంతేకాక, ఒత్తిడితో కూడుకున్న రోజు తర్వాత చేసే జాగింగ్, వర్కౌట్స్ అధిక ప్రయోజనాలను కలిగి ఉంటాయని చెబుతున్నారు. పాప్ సింగర్ లేడీ గాగా ఏకంగా, తెల్లవారుజామున 2 గంటలకు వ్యాయామంకోసం సమయం కేటాయించింది. నిజానికి, ఎక్కువమంది ప్రజలు ఇలా రాత్రి సమయాలలోనే వర్కౌట్ల నియమావళికి అనుకూలంగా ఉన్నారు
ఉదయంచేసే వర్కౌట్స్ జీవక్రియలను పెంచుతుందని అంటారు. అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ ఎక్సర్సైజ్ డాక్టర్ సెడ్రిక్ బ్రయంట్, చెప్పినట్లు "ఉదయంచేసే వ్యాయామాలు రోజంతా మంచి శక్తి స్థాయిలను అందిస్తాయి. ఇది శరీరంలో ఎండార్ఫిన్లనే కాకుండా, ఇతర మూడ్ ఎలివేటర్లను కూడా పెంచుతుంది. ఇవి రోజంతా ప్రశాంతంగా ఉండేందుకు సహాయం చేస్తుంది. బ్రిస్టల్ విశ్వవిద్యాలయం అధ్యయనంలో ఆఫీస్ సమయానికన్నా ముందు వర్కౌట్స్ చేసేవారు, మరింత ఎనర్జీతో వర్క్ చేస్తున్నారని తెలిపింది.
అప్పలాచియన్ స్టేట్ యూనివర్శిటీ పరిశోధనలో ఉదయం 7 గంటలకు బరువులు ఎత్తడం, వర్కౌట్స్ చేయడం అనుసరించేవారు, సాయంత్రం సమయాన్ని పాటించేవారి కన్నా వేగంగా నిద్రపోవడం జరిగింది.
ఒక్కోసారి ఆఫీసులో తీవ్రమైన ఒత్తిడితో కూడిన వాతావరణం ఉంటుంది. ఈ ఒత్తిడి, ఆందోళనలు, చిరాకులను తొలగించడానికి ఉదయంకన్నా, రాత్రిపూట వర్కౌట్స్ సహాయపడగలవు. సాయంత్రంపూట చేసే వ్యాయామం మనస్సును కుదుట పరుస్తుంది. సాయంత్రం కీళ్ళు, కండరాలు దృడంగా ఉంటాయని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. క్రమంగా ఎక్కువసేపు వర్కౌట్స్ చేసేందుకు అనువుగా ఉంటుంది.

మీకు ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేవడం కష్టంగా ఉంటే, ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. బ్రియాంట్ సూచన ప్రకారం, ఇలా నిద్ర సమస్యలను ఎదుర్కొంటున్న వారైతే మీరు నిద్రలేమి(ఇన్సోమ్నియా) ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి, వర్కౌట్స్ సమయం మీకు అనువుగా ఉండేలా ఎంచుకోవాలి.
ఆఫీస్ ముందు జిమ్‌ వెళ్ళడం, కొంచం కఠినంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మీ షెడ్యూల్‌ మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి, ఆహారం, ఆఫీస్, జిమ్ టైమింగ్స్ ప్రకారం ఒక ప్రణాళికను అనుసరించడం మంచిది. అంతేకాకుండా, సరైన ప్రణాళికలేని లైఫ్ స్టైల్, మీ వర్కౌట్లమీద మనసు వెళ్ళకుండా చేస్తుంది.
మీరు నిద్రవేళకు ముందు వర్కౌట్లు చేస్తున్నందున, మీరు మీ డిన్నర్ కు సరైన సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. డిన్నర్, వర్కౌట్ల మధ్య కనీసం 1.5 గంటలు ఉండేలా, కొద్దిగా తక్కువ తినేలా చూసుకోండి.
ఎక్కువగా డెస్క్ జాబ్స్ చేసేవాళ్ళు, ఫిట్‌నెస్‌ను పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి గంటకు కనీసం ఒకసారి, నిలబడి స్ట్రెచ్చింగ్ చేయడం ద్వారా కూడా కొంత ఫిట్నెస్ సాధించగలరని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. అదేవిధంగా, బ్లాక్ చుట్టూ నడవడం, మెట్లు ఎక్కిదిగడం కూడా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలని తగ్గిస్తుంది.





Untitled Document
Advertisements