'గూగుల్‌ అసిస్టెంట్‌' లో మన జాతీయ భాష..

     Written by : smtv Desk | Sun, Feb 25, 2018, 02:08 PM

 'గూగుల్‌ అసిస్టెంట్‌' లో మన జాతీయ భాష..

శాన్‌ఫ్రాన్సిస్కో, ఫిబ్రవరి 25: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యుగంలో ప్రతి ఒక్కరు తమ అవసరాల కోసం సాంకేతికత ను విస్తృతంగా వాడుకుంటున్నారు. ముఖ్యంగా 'గూగుల్' మానవ గతిగమనాన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాగా గూగుల్‌ అసిస్టెంట్‌ లో ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జపనీస్, కొరియన్, స్పానిష్, పోర్చుగీస్‌ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది.

2018 చివరికల్లా మన జాతీయ భాష హిందీ సహా 30కిపైగా భాషల్లో గూగుల్‌ అసిస్టెంట్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని ఆ సంస్థ తెలిపింది. ఏ స్మార్ట్‌ఫోన్‌లో అయినా హోమ్‌పేజ్‌ బటన్‌ను కొద్దిసేపు నొక్కిపట్టుకోవడం లేదా 'ఓకే గూగుల్‌' అని చెప్పడం ద్వారా' గూగుల్‌ అసిస్టెంట్‌' ను యాక్టివేట్‌ చేసుకోవచ్చు.





Untitled Document
Advertisements