వైరల్ గా మారిన ముష్ఫికర్‌ నాగిని డ్యాన్స్‌ ..

     Written by : smtv Desk | Sun, Mar 11, 2018, 04:16 PM

వైరల్ గా మారిన ముష్ఫికర్‌ నాగిని డ్యాన్స్‌ ..

కొలంబో, మార్చి 11 : శ్రీలంక లో జరుగుతున్నా ముక్కోణపు టీ-20 ట్రోఫీ లో భాగంగా నిన్నమ్యాచ్ లో బంగ్లాదేశ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ తన అద్భుత బ్యాటింగ్ తో జట్టుకు విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. శ్రీలంక- బంగ్లాదేశ్ ల మధ్య జరిగిన మూడో మ్యాచ్ లో ముష్ఫికర్‌ అసాధారణ ఆట ముందు లంక నిర్దేశించిన 214 పరుగుల లక్ష్యం చిన్నబోయింది. బంగ్లాను విజయతీరాలకు చేర్చిన అతను 35 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో చెలరేగి 72 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ప్రత్యర్ధి విసిరిన భారీ లక్ష్యాన్ని బంగ్లాదేశ్ జట్టు మరో రెండు బంతులు మిగిలుండగానే చేధించింది. దీంతో ముష్ఫికర్‌ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. సంతోషం పట్టలేక ఎగిరి గంతేసి.. నాగిని డ్యాన్స్‌ చేస్తూ విజయోత్సాహంను ఆస్వాదించాడు. ఇప్పుడు ఈ నాగిని డ్యాన్స్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఆటతోపాటు ఈ డ్యాన్స్‌ ఎంతో నచ్చిందని నెటిజన్లు ముష్ఫికర్‌పై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు.

శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. అనంతరం బంగ్లా 19.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. టోర్నీలో భాగంగా సోమవారం జరిగే మ్యాచ్‌లో భారత్‌ శ్రీలంకతో తలపడుతుంది.

Untitled Document
Advertisements