కాంగ్రెస్ నేతల తీరుపై సీఎం సీరియస్..!

     Written by : smtv Desk | Tue, Mar 13, 2018, 11:51 AM

కాంగ్రెస్ నేతల తీరుపై సీఎం సీరియస్..!

హైదరాబాద్, మార్చి 13 : అసెంబ్లీ సమావేశాల్లో పలువురు నాయకులు రాజకీయ ముసుగులో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. నిన్న అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ నేతలు ప్రవర్తించిన తీరు సిగ్గుచేటన్నారు. వారు చేసిన పనిని ప్రపంచమంతా టీవీలో చూశారు. విపక్షాలు కోరినన్ని రోజులు సభను నిర్వహిస్తామని తెలిపినా.. తొలిరోజు ఆందోళన చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. హెడ్‌సెట్‌ తగిలి మండలి చైర్మన్‌ కన్నుకు దెబ్బ తగిలితే తను నాటకమాడుతున్నారంటూ కాంగ్రెస్‌ నేతలు ఆరోపణలు చేయడం సిగ్గచేటన్నారు. బీఏసీ సమావేశంలో అన్నింటికీ ఒప్పుకుని తీరా సభలోకి అడుగుపెట్టగానే ఇలా ఆందోళనను చేపట్టడం ఏంటి.? ఇలా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

Untitled Document
Advertisements