జాన్విని శ్రీదేవితో పోల్చడం సరికాదు: ఫరా ఖాన్

     Written by : smtv Desk | Tue, Mar 13, 2018, 04:34 PM

జాన్విని శ్రీదేవితో పోల్చడం సరికాదు: ఫరా ఖాన్

ముంబై, మార్చి 13 : ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ జాన్విని శ్రీదేవితో పోల్చడం సరికాదన్నారు. ఎందుకంటే జాన్వి వయస్సు నాటికి శ్రీదేవి సూపర్ స్టార్ గా వెలిగిపోయరని అందుకే జాన్విని శ్రీదేవితో పోల్చలేమని చెప్పారు. శ్రీదేవి అంటే తనకు చాలా ఇష్టమని, ఆమె ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనని అన్నారు.

ప్రస్తుతం జాన్వి నటిస్తున్న 'ధడక్' సినిమా కి ఫరా ఖాన్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. జాన్వి మంచి డాన్సర్ అని ఎదైనా వెంటనే నేర్చుకుంటుందని ఆయన అభినందించారు. ధర్మ ప్రొడక్షన్ బ్యానెర్ పై కరణ్ జోహార్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో షాహీద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖత్తర్ హీరోగా నటిస్తున్నాడు. శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను జూన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కసరత్తులు చేస్తున్నారు.

Untitled Document
Advertisements