మన దెబ్బకు సీనియర్స్‌ అబ్బా! అనాలి..

     Written by : smtv Desk | Wed, Mar 14, 2018, 06:00 PM

మన దెబ్బకు సీనియర్స్‌ అబ్బా! అనాలి..

హైదరాబాద్, మార్చి 14 : శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో నిఖిల్ 'కిరాక్ పార్టీ' చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలతో ఉన్న ప్రేక్షకులను మరింత ఉత్సాహపరిచేందుకు తాజాగా చిత్ర బృందం 'కిరాక్‌పార్టీ' థియేట్రికల్‌ ట్రైలర్‌ ను విడుదల చేసింది. ట్రైలర్ లో 'రోజురోజుకి సీనియర్స్ అరాచకాలు ఎక్కువవుతున్నాయి.. వాడు సీఎస్‌ఈ, ఈసీ, నేను మెక్‌ అనే భేదాభావాలొద్దు. మనమంతా ఒక్కటి. మన దెబ్బకు సీనియర్స్‌ అబ్బా! అనాలి' అంటు నిఖిల్‌ చాలా చలాకీగా కనిపించాడు. కాలేజీ రోజుల్లో ఉండే అల్లరి, సరదాలు, ఇంట్లో వారికి డబ్బుల కోసం అబద్దాలు చెప్పడంలాంటి సరదా సన్నివేశాలు బాగున్నాయి. అజనీష్‌ లోకనాథ్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఈ నెల 16వ తేదీన విడుదల కానుంది.

Untitled Document
Advertisements