పవన్ పై మళ్ళీ "కత్తి" దూసిన మహేష్..

     Written by : smtv Desk | Thu, Mar 29, 2018, 06:58 PM

పవన్ పై మళ్ళీ

హైదరాబాద్, మార్చి 29 : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు, కత్తి మహేష్ కు గత కొంత కాలంగా మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అంతా సద్దుమణిగి కొంతకాలం కత్తి మహేష్ ఎలాంటి విమర్శలూ చేయలేదు. దీంతో వివాదం తొలగిపోయిందనే అంతా భావించారు. తాజాగా.. కత్తి మహేష్ మళ్ళీ పవన్ పై విరుచుకపడ్డారు. తన ట్విట్టర్ వేదికగా పవన్ పై విమర్శలు గుప్పించారు.

"బాబూ పవన్ కళ్యాణ్.! రాజ్యాంగ సంక్షోభం అనగానేమి? 10 మార్కుల ప్రశ్న. సమాధానం చెప్పుడు. చంద్రబాబు నాయుడు పార్లమెంటు ముందు నిరసన చేసిన యెడల, ఆ రాజ్యాంగ సంక్షోభం ఎలా ఏర్పడును? ఉప ప్రశ్న. 5 మార్కులు. పూరింపుడు. నోరు తెరిస్తే అజ్ఞానం. అజ్ఞానవాసి సుఖీభవ!" అంటూ ఆరోపించారు.

అంతేకాకుండా "మరోసారి వామపక్షాలతో, పార్టీ నాయకులు (?), కార్యకర్తలతో ప్రత్యేక హోదా గురించి చర్చించడానికి సిద్ధమైన పవన్ కళ్యాణ్. 4,5,6 తారీఖుల్లో విజయవాడ రానున్నారు. ఒకటో సారి!, రెండో సారి!!, మూడో సారి!!!, మరోసారి!, ఇంకోసారి!!, ఆపైన... ప్రతిసారీ!!!, చివరికి సారీ సారీ. అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Untitled Document
Advertisements