ఈ నెల 12న ఏపీ ఇంటర్‌ పరీక్షా ఫలితాలు

     Written by : smtv Desk | Tue, Apr 10, 2018, 05:52 PM

ఈ నెల 12న ఏపీ ఇంటర్‌ పరీక్షా ఫలితాలు

విజయవాడ, ఏప్రిల్ 10: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ విద్యా మండలి గత నెలలో నిర్వహించిన పరీక్ష ఫలితాలను ఈ నెల 12న విడుదల చేయనున్నట్టు బోర్డు ప్రకటించింది. విజయవాడలోని తమ కార్యాలయం నుంచి పరీక్షల నియంత్రణ అధికారి రమేశ్ ఈ రోజు ఫలితాలపై ప్రకటన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రయోగ, థియరీ, జనరల్, ఒకేషనల్ కోర్సులకు నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలను రాజమహేంద్ర వరం నుంచి ఈ నెల 12న, అలాగే మొదటి సంవత్సర పరీక్ష ఫలితాలను విశాఖపట్నం నుంచి ఈ నెల 13న విడుదల చేస్తామని తెలిపారు.

ఈ పరీక్షల ఫలితాలను ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి బీ ఉదయలక్ష్మి సంయుక్తంగా విడుదల చేస్తారని వివరించారు.

Untitled Document
Advertisements