అల్జీర్స్ విమాన ప్రమాదంలో 257 మంది మృతి

     Written by : smtv Desk | Wed, Apr 11, 2018, 07:56 PM

 అల్జీర్స్ విమాన ప్రమాదంలో 257 మంది మృతి

అల్జీర్స్, ఏప్రిల్ 11 : అల్జీరియా రాజధాని అల్జీర్స్‌లో బుధవారం ఉదయం ఓ సైనిక విమానం కూలిపోయిన దుర్ఘటనలో 257 మంది మరణించినట్లు ప్రభుత్వ మీడియా వెల్లడించింది. అల్జీర్స్ నుంచి 30 కి.మీ. దూరంలో ఈ ప్రమాదం జరిగింది. విమానం కూలగానే పెద్ద ఎత్తున నల్లని పొగలు వెలువడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. తొలుత ఈ ప్రమాదంలో 100 మంది మృతి చెందరని వార్తలు వెలువడ్డాయి. తర్వాత మృతుల సంఖ్య 257 అని ప్రభుత్వం ప్రకటించింది.

మృతుల్లో 10 మంది విమాన సిబ్బంది అని ప్రభుత్వ రేడియో అల్జీరీ తెలిపింది. ఈ ప్రమాదం నుంచి సజీవంగా ఎవరైనా బయటపడ్డారో, లేదో స్పష్టంగా చెప్పలేమని అధికారులు తెలిపారు. విమాన శకలాల నుంచి పొగ, జ్వాలలు వస్తున్నాయి. అత్యవసర సేవల సిబ్బంది, భద్రతా సిబ్బంది హుటాహుటీన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.

Untitled Document
Advertisements