జాతీయ అవార్డులు సాధించిన చిత్రాలు..

     Written by : smtv Desk | Fri, Apr 13, 2018, 03:25 PM

జాతీయ అవార్డులు సాధించిన చిత్రాలు..

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13 : 65వ ప్రతిష్టాత్మక జాతీయ అవార్డుల ఉత్సవం ఢిల్లీలో ఘనంగా జరిగింది. బాలీవుడ్‌ దర్శకుడు శేఖర్‌ కపూర్‌ ఈ అవార్డులను ప్రకటించారు. 2017లో విడుదలైన చిత్రాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డులను ప్రకటించారు. మే 3వ తేదీన విజేతలకు అవార్డులు ప్రదానం చేస్తారు.

*అవార్డులు సాధించినవారు...

ఉత్తమ నటి: శ్రీదేవి (మామ్‌)
ఉత్తమ తెలుగు చిత్రం: ఘాజీ
ఉత్తమ హిందీ చిత్రం: న్యూటన్
ఉత్తమ యాక్షన్‌ చిత్రం: బాహుబలి-2
ఉత్తమ సంగీత దర్శకుడు: ఏ.ఆర్‌ రెహమాన్‌ (మామ్‌), (కాట్రు వెలియిదాయ్‌)
ఉత్తమ కొరియోగ్రాఫర్‌: గణేశ్‌ ఆచార్య (టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌కథా)
ఉత్తమ దర్శకుడు: జయరాజ్‌ (మలయాళ చిత్రం భయానకం)
ఉత్తమ సహాయ నటుడు: ఫహాద్ ఫాసిల్‌ (తొండిముత్తలం ద్రిసాక్షియుం)
దాదాసాహెబ్‌ ఫాల్కే : బాలీవుడ్‌ నటుడు వినోద్‌ ఖన్నా

Untitled Document
Advertisements