శ్రీనివాసుని పెళ్ళికి ముహూర్తం ఖరారు..!!

     Written by : smtv Desk | Wed, Apr 18, 2018, 06:48 PM

శ్రీనివాసుని పెళ్ళికి ముహూర్తం ఖరారు..!!

హైదరాబాద్, ఏప్రిల్ 18 : కళ్యాణ సుభవీణ మోగించడానికి సుముహూర్తం ఖరారైంది. శ్రీనివాసుడు పెళ్ళికి సిద్దమయ్యాడు. ఇక శివ ధనస్సు విరిచి ప్రేక్షకుల మనస్సు గెలవడమొక్కటే ఆలస్యం. ఇదంతా ఏంటి అనుకుంటున్నారా..? మరేం లేదండి నితిన్ హీరోగా నటిస్తున్న 'శ్రీనివాస కళ్యాణం' రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.

గతేడాది ఉత్తమ ప్రజాధారణ పొంది జాతీయ అవార్డు అందుకున్న “శతమానం భవతి” సినిమా దర్శకుడు సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్న చిత్రం “శ్రీనివాస కల్యాణం”. కుటుంబ కథా చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇదివరకే పెళ్లికొడుకు గెటప్‌లో హీరో నితిన్, పెళ్లి కూతురు గెటప్ లో రాశీఖన్నా ఉన్న పోస్టర్ విడుదలైన విషయం తెలిసిందే. మొన్న శ్రీరామనవమి పండగ సందర్భంగా రిలీజ్ చేసిన పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

అయితే మొదటి షెడ్యూల్ షూటింగ్ గోదావరి జిల్లాల్లో జరగగా, ప్రస్తుతం రెండవ షెడ్యూల్ ను చండీఘర్ లో చిత్రిస్తున్నారు. ‘లై’, ‘చల్ మోహన్ రంగ’ చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో నితిన్ కి ఈ సినిమా కీలకంగా మారింది. నందితా శ్వేత మరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని జులై 24న రిలీజ్ చేయడానికి నిర్ణయించారు.





Untitled Document
Advertisements