శ్రీకాళహస్తిలో పవన్ ప్రత్యేక పూజలు...

     Written by : smtv Desk | Tue, May 15, 2018, 03:32 PM

శ్రీకాళహస్తిలో పవన్ ప్రత్యేక పూజలు...

అమరావతి, మే 15 : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దైవదర్శనం నిమిత్తం తిరుమల దేవస్థానాన్ని సందర్శించిన విషయం తెలిసిందే. నేడు చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం గుడిమళ్లం శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ రాకతో ఆలయ ప్రాంగణమంతా సందడిగా నెలకొంది. ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం పవన్ కు ఆలయ అధికారులు, అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.

అనంతరం ఆయన శ్రీకాళహస్తిలో స్వామివారిని, వికృత మాలలోని శ్రీసంతాన వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఏపీలో పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్ర శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ బస్సు యాత్ర ప్రారంభించడానికి ముందు పవన్ తిరుమలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ యాత్ర కోసం కొన్ని కమిటీలను నియమించినట్లు తెలుస్తోంది.

Untitled Document
Advertisements