అభిమాని ప్రశ్నకు.. షారుఖ్ ఏమన్నాడంటే..

     Written by : smtv Desk | Sun, Jul 15, 2018, 04:16 PM

అభిమాని ప్రశ్నకు.. షారుఖ్ ఏమన్నాడంటే..

ముంబై, జూలై 15 : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కు ఓ అభిమాని నుండి ఒక వింత ప్రశ్న ఎదురైంది. దానికి సరైన సమాధానం ఇస్తూ.. అందరిని కాస్త ఆశ్చర్యానికి గురిచేశాడు షారుఖ్. షారుఖ్ సమాధానం విన్న అభిమానులు.. ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు. ఇంతకు ఆ ప్రశ్న, సమాధానం ఏంటంటే.. "అంత త్వరగా ఎందుకు పెళ్లి చేసుకున్నారు సర్?‌" అని ఓ అభిమాని షారుఖ్ ను ప్రశ్నించాడు.

ఇందుకు షారుక్‌.. 'భాయ్‌.. ప్రేమ, అదృష్టం ఎప్పుడు కలుగుతాయో చెప్పలేం. గౌరీ వల్ల నాకు ఆ రెండూ త్వరగానే దక్కాయి' అని పర్‌ఫెక్ట్‌ సమాధానం ఇచ్చారు. ఆరేళ్లు ప్రేమించుకున్నాక షారుక్‌, గౌరి 1991లో వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఈ సమాధానం విన్న షారుఖ్ అభిమానులు.. చూడముచ్చటైన జంట షారూక్-గౌరి అని కితాబిస్తున్నారు. కాగా షారుఖ్ దంపతులకు ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల ఉన్నారు.





Untitled Document
Advertisements