'శ్రీనివాస కళ్యాణం' నుంచి టీజర్ రిలీజ్..

     Written by : smtv Desk | Thu, Jul 19, 2018, 11:27 AM

'శ్రీనివాస కళ్యాణం' నుంచి టీజర్ రిలీజ్..

హైదరాబాద్, జూలై 19 : యువ హీరో నితిన్.. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో 'శ్రీనివాస కళ్యాణం' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నితిన్ సరసన రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్‌ టీజర్‌ను చిత్రబృందం ఈరోజు విడుదల చేసింది.

"మనం పుట్టినప్పుడు మన వాళ్లంతా ఆనందపడతారు. అది మనకి తెలియదు. మనం దూరమైనప్పుడు మన వాళ్లంతా బాధపడతారు. అదీ మనకి తెలియదు. మనకి తెలిసి మనం సంతోషంగా వుండి.. మనవాళ్లంతా సంతోషంగా వుండేది ఒక్క పెళ్లిలో మాత్రమే. అలాంటి పెళ్లి గొప్పతనం గురించి చెప్పే ఓ చిన్ని ప్రయత్నమే మా ఈ 'శ్రీనివాస కళ్యాణం'" అంటూ జయసుధతో చెప్పించిన వాయిస్ ఓవర్ ఆకట్టుకుంటోంది.

అలాగే ఈ సినిమా ఆడియో వేడుకను ఈ నెల 22వ తేదీన జరపనున్నట్టుగా ఈ టీజర్ ద్వారానే తెలియజేశారు. ఆగస్ట్‌ 9న ఈ చిత్రం ప్రేక్షకులమ ముందుకురానుంది. ఈ చిత్రంలో నందితా శ్వేత మరో హీరోయిన్‌గా నటిస్తోంది. మిక్కీ జే మేయర్‌ సంగీతమందిస్తున్నారు. అయితే ఇప్పటికే 'లై', 'చల్ మోహన్‌ రంగా' చిత్రాల పరాజయంలో ఉన్న నితిన్ ఈ సినిమా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాడు.

Untitled Document
Advertisements